Tollywood Heroes: ఆంధ్రప్రదేశ్ లో గత రెండు వారాలలో భారీ వర్షాలు పడి అక్కడి జనం జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కనీవినీ ఎరుగని వరద బీభత్సంతో తీవ్ర ఇబందులు పడ్డాయి. సహజంగా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు సినిమా హీరోలంతా విరాళాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ సారి మాత్రం హీరోలు ముందుకు రాలేదు.

అనేక గ్రామాల్లో ఇంకా వరదనీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. ఇక కొంతమంది సామాన్యులు తీవ్రంగా కష్టాలు పడుతున్నా.. హీరోలు పట్టించుకోకపోవడం పై జగన్ ప్రభుత్వం సీరియస్ అయింది. అసలు ఇలాంటి కష్టకాలంలో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి హీరోలు విరాళాలు ఎందుకు ఇవ్వరు ? ప్రజల ద్వారా ఎదిగి, ఆ ప్రజలు కష్టకాలంలో ఉంటే మౌనంగా ఉంటారా ?
ఈ బాధల సమయంలో సాయం చేయడానికి ఎందుకు ముందుకు రారు ? అంటూ జగన్ ప్రభుత్వం సినిమా వాళ్ళ పై విరుచుకు పడింది. అయినా మన హీరోలు ఏ మాత్రం స్పందించలేదు. అంతలో మూడు రోజులు గడిచిపోయాయి. ఇక విరాళాలు గోల పోయిందని అందరూ భావించారు. కానీ అంతలో ఏమి జరిగిందో ఏమో.. ఉన్నట్టు ఉండి.. మళ్ళీ విరాళాల గోల ఊపందుకుంది.
వరద ప్రాంత బాధితులకు సాయం చేయడానికి తాను ఈ డొనేషన్ ఇస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా అందరి కంటే ముందు 25 లక్షల విరాళం ప్రకటించాడు. ఎన్టీఆర్ ప్రకటించగానే ఇక మిగిలిన హీరోలంతా క్యూ కట్టారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబులు కూడా తలా రూ. పాతిక లక్షల విరాళాలు ప్రకటించి మొత్తానికి జగన్ ప్రభుత్వానికి టార్గెట్ కాకుండా తప్పించుకున్నారు.
Also Read: Balayya: బాలయ్య ఊపు తెచ్చాడు.. బాక్సాఫీస్ ను ఊపేశాడు !
ఇక మిగిలిన హీరోలు కూడా తమ వంతు సాయం అంటూ ఎంతోకొంత విరాళం ప్రకటించే అవకాశం ఉంది. అయితే, వరదలు వచ్చి వెళ్లిపోయిన తర్వాత మన హీరోలంతా ఎందుకు పెద్ద ఎత్తున ఒకే సారి విరాళాలు ప్రకటిస్తున్నారు ? ఈ ప్రకటనల వెనుక ఎవరైనా ఉన్నారా ? లేక, రానున్న తమ సినిమాల రిలీజ్ లను దృష్టిలో పెట్టుకుని ముందుగానే జాగ్రత్త పడుతున్నారా ?. పాపం చివరకు భయపడుతూనే సాయం చేయాల్సి వస్తోంది.
Also Read: Manchu Vishnu: ఇక్కడే ఏమి చేయలేని విష్ణు ఇక అక్కడేం చేస్తాడు ?