https://oktelugu.com/

Game Changer Trailer: గేమ్ చేంజర్ ట్రైలర్ లో అంజలి పాత్ర ను చూస్తుంటే భారతీయుడు సినిమాలో ఆ పాత్ర గుర్తుకు వస్తుందిగా…

ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకులందరు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటి అంటే మన హీరోలకు పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది. తద్వారా మన హీరోల క్రేజ్ ను వాడుకొని భారీ సక్సెస్ లను అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 07:02 PM IST

    Game Changer Trailer(4)

    Follow us on

    Game Changer Trailer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యనైతే సంతరించుకుంటుంది. ఇక మొదటి పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేశాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో విజయాన్ని సాధిస్తే ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు రావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఆయన స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. కారణం ఏదైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడంలో మాత్రం ఆయన వరసగా ఫెయిల్ అవుతున్నాడు. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండతో ఈసారి సూపర్ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ లో అంజలి రామ్ చరణ్ భార్యగా నటించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రాబోతున్నట్టుగా కూడా మనకు ట్రైలర్ ను చూస్తే ఈజీగా అర్థమైపోతుంది…

    ఇక ఈ సినిమా ట్రైలర్ లో అంజలి పాత్రను కనక మనం చూసినట్లైతే ఇంతకు ముందు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు సినిమాలో సుకన్య పాత్ర మనకు గుర్తొస్తోంది… ఇక సుకన్య ఆ సినిమాలో మంచి కోసం పోరాడే భర్త(కమల్ హాసన్) కి తోడుగా ఉండే ఒక భార్య పాత్రలో నటించి మెప్పించింది.

    ఇక దాంతోపాటుగా ఆ సినిమా మొత్తం అతనితోనే ఆమె ట్రావెల్ చేయడమే కాకుండా ఆయన గురించి హైప్ ఇస్తూ ఆయన ఎలాంటి పర్సన్ అనేది తన కొడుకుకు చెప్పే ఒక క్యారెక్టర్ లో ఆమె నిజంగా ప్రతి ఒక్కరిని మెప్పించిందనే చెప్పాలి. మరి ఈ సినిమాలో కూడా అంజలి తన భర్త మాట జవదాటని మహిళగా నటించడమే కాకుండా ఆయన గురించి యావత్ జనానికి తెలిసేలా తన గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ కొన్ని డైలాగులను కూడా చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది…మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ తోనే ‘భారతీయుడు ‘ మూవీని గుర్తు చేసిన శంకర్ ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ ను అయితే మెగా అభిమానుల్లో నింపాడు. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం ఈనెల 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…