Bloody Mary Movie Online: ఓటీటీలు వచ్చాక కొత్త కంటెంట్ పుట్టుకొస్తోంది. సరికొత్తగా ఆవిష్కృతమవుతోంది. 2.30 గంటల్లో చెప్పలేని ఎన్నో ఉత్కంఠ కథనాలను ఓటీటీ వేదికగా ఎపిసోడ్స్ గా ప్రసారమవుతున్నాయి. అవి ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’ లాంటి ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు దేశంలో ప్రేక్షకాదరణ పొందాయి
ఇక ఇప్పుడు తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో కూడా అద్భుతమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ పై మేకర్స్ దృష్టి సారిస్తున్నారు.
Bloody Mary Movie Online
ఇప్పుడు ‘ఆహా’లో ప్రసారం అవుతున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ‘బ్లడీ మేరీ’. ‘కార్తికేయ’ మూవీ ఫేమ్.. విలక్షణ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రంలో కిరీటి దామరాజు, రాజ్‌కుమా కోపిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Acharya: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరంటే?
నివేదా పేతురాజ్ దృష్టి లోపం ఉన్న మహిళ పాత్రను ఈ సినిమాలో పోషించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించింది. ఎంఎం కీరవాణి తనయుడు కాల భైరవ, కార్తీక్ ఘట్టమనేని వంటి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు బ్లడీ మేరీకి పనిచేశారు.
బ్లడీ మేరీలో అజయ్, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.. ఆహా ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ప్లాట్‌ఫారమ్‌పై అనేక ఆసక్తికరమైన సినిమాలు.. వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తోంది. భీమ్లా నాయక్… గని వంటి ప్రముఖ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసింది.
Bloody Mary Movie Online
ఇందులో ప్రధాన ముగ్గురు నటులు హత్య కేసులో ఇరుక్కుంటారు. అందులోంచి వారు ఎలా బయటపడ్డారు.? ఎలా దీన్ని ఫేస్ చేశారన్నది సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను మలిచారు. అజయ్ పోషించిన ఒక పోలీసు అధికారి పాత్ర ఆకట్టుకునేలా ఉంది. ఈ స్నేహితులు అజయ్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది చిత్ర కథ.
వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ గా అదిరిపోయిందని చూసిన వారు అంటున్నారు. నివేత పాత్ర.. కథాంశం చాలా ఆసక్తికరంగా ఉందని కితాబిస్తున్నారు. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్న ఇది ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం అవుతోంది.
Also Read:Varun Tej Lavanya Tripathi Marriage: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. ప్రూఫ్ ఇదే