Hanuman: హనుమాన్ మూవీ సూపర్ హిట్. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సోషియో ఫాంటసీ అంశాలకు డివోషనల్ టచ్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. హీరోగా తేజ సజ్జా నటించాడు. ఫస్ట్ డే హనుమాన్ వరల్డ్ వైడ్ రూ. 21 కోట్ల గ్రాస్ రాబట్టింది. సంక్రాంతి సెలవులకు హనుమాన్ కుమ్మేయడం ఖాయం అంటున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాల్లో నిజమైన హనుమంతుడు రంగంలోకి దిగుతాడు. లార్డ్ హనుమాన్ స్క్రీన్ పై ఉన్నంత సేపు గూస్ బంప్స్ కలుగుతాయి. సినిమాకు హనుమాన్ ఎంట్రీ చాలా ప్లస్ అయ్యింది. అయితే ఈ హనుమాన్ పాత్ర చేసింది ఎవరు? అనేది ఇంత వరకు తెలియదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కడా లీక్ చేయలేదు. హనుమంతుడు గెటప్ కావడంతో ప్రేక్షకులు కూడా ఆ పాత్ర చేసిన నటుడు ఎవరనేది గుర్తించలేదు.
అయితే హనుమాన్ మూవీలో హనుమంతుడిగా కనిపించింది ఒక స్టార్ హీరో అట. ఆయన ఎవరో కాదు రానా దగ్గుబాటి అట. ఈ మేరకు ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇది తెలిశాక, రానా నా ఆ పాత్ర చేసింది? అసలు గుర్తించలేదే! అని ఆశర్యపోవడం ప్రేక్షకుల వంతు అయ్యింది. కాగా రానా నటించాడా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇది సోషల్ మీడియా సమాచారం మాత్రమే. దర్శకుడు ప్రశాంత్ వర్మ రివీల్ చేసే వరకు ఇది సస్పెన్సు.
హనుమాన్ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించారు. అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇక ప్రధాన విలన్ రోల్ వినయ్ రాయ్ చేశారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటించారు. తేజ సజ్జాకు హనుమాన్ రూపంలో భారీ హిట్ పడింది.