War2 JrNTR Vs Hrithik Roshan: మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు. అసలు ఈ చిత్రం ఉంది అనే విషయమే ఎవ్వరూ గుర్తించడం లేదు. నేడు రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదనే ఈ సినిమా ఓపెనింగ్స్ ఆధారపడుంది. ఇదంతా పక్కన పెడితే నార్త్ అమెరికా తో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. కనీసం హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ అయినా వస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. నార్త్ అమెరికా బుకింగ్స్ ఎలా ఉన్నా, డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతాయని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.
నార్త్ ఇండియా లో ముంబై, పూణే, మహారాష్ట్ర, న్యూ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కనీసం రెండు వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదు. హైదరాబాద్ లో కూడా హిందీ వెర్షన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, ఇక్కడ కూడా అదే పరిస్థితి. బెంగళూరు లో తెలుగు మరియు హిందీ వెర్షన్ కలిపి 7 లక్షల రూపాయిల గ్రాస్ ఇప్పటి వరకు వచ్చింది. ఇంత వీక్ రెస్పాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే నేడు ఈ సినిమాకు సంబంధించిన చిన్న యాక్షన్ ప్రోమో ని మేకర్స్ విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశం మామూలు రేంజ్ లో ఉండదు అనే విషయం ఈ ప్రోమోలను చూస్తే అర్థం అవుతుంది.
ఈ ప్రోమో లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కేవలం ఒంటి చేతితో ఫైటింగ్ చేసుకుంటారు. దానికి సంబంధించిన షాట్స్ ని మనం బాగా క్లోజ్ గా గమనిస్తే తెలుస్తుంది. అయితే వాళ్ళ చేతులకు దెబ్బలు తగలడం వల్ల ఇలా ఒంటి చేత్తో ఫైటింగ్ చేసుకున్నారా?, లేకపోతే ఏదైనా ఛాలెంజ్ పెట్టుకొని చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈరోజు విడుదల చేసిన ప్రోమో లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రెండు పులులు లాగా కనిపించారు. సినిమా ఫలితం ఏదైనా కానీ, వీళ్లిద్దరి కాంబినేషన్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే అనుభూతి వేరే లెవెల్ లో ఉండబోతుంది. చూడాలి మరి ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను ఏ మేరకు అందుకుంటుంది అనేది. ఈ చిత్రం లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. ఆమెకు సంబందించిన బికినీ షాట్స్ సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యాయో మనమంతా చూశాము.