War 2 Pre Release Event : ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నప్పటికీ మేకర్స్ సరిగా ప్రమోట్ చేయడం లేదని అభిమానులు నుండి భారీగా కంప్లైంట్స్ వస్తున్న ఈ నేపథ్యం లో నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అశేషంగా అభిమానులు తరళి రాగా, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ని చూసి వాళ్ళు కొట్టిన కేరింతలు గ్రౌండ్ దద్దరిల్లిపోయింది. ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్నవాళ్ళంతా నాకు సన్నిహితులే,బాగా ఇష్టమైన వాళ్ళే.నాకు ఎంతో మంచి స్నేహితుడు, ఎంత ఎంతగానో అభిమానించే జూనియర్ ఎన్టీఆర్, ఆయనతో నా ప్రయాణం దాదాపుగా పాతికేళ్ళు. నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్ కి వెళ్లి చెప్పట్లు కొట్టిన చూసిన ‘కహోనా ప్యార్ హై హీరో హృతిక్ రోషన్ గారు, అదే విధంగా నేను ‘ఏ జవానీ..హేయ్ దివాని’ సినిమాని నాన్ స్టాప్ గా 20,30 సార్లు చూసి ఉంటాను. అంత అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, నా కుటుంబ సభ్యులలో ఒకరైన నాగవంశీ, ఇలా అందరూ ఒకే చోట ఈ ఫంక్షన్ కి రావడం. రామారావు గారిని ఇష్టపడే ఇంతమంది జనాల మధ్య నేరుగా మాట్లాడే అవకాశం రావడం, చాలా ఆనందంగా ఉంది. మ్యాడ్ ఫంక్షన్ కి ఆయన వచ్చినప్పుడు ‘దేవర’ నామ సంవత్సర అని చెప్పను కదా,అదే విధంగా ఈ సంవత్సరాన్ని హృతిక్ రామారావు సంవత్సరం గా పరిగణిద్దాం. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. దిల్ రాజు గారు చెప్పినట్టు 72 గంటల తర్వాత మనం దానిని థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం. అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థం అయ్యింది ఏమిటంటే, ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, దానికి మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఇందులో ఉంది.’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు అని మీరు అనుకోని ఉండొచ్చు. కానీ నాకు అర్థం అయ్యింది ఏమిటంటే తారక్ కి సంబంధించినంత వరకు హృతిక్ రోషన్ చెడ్డవాడు, హృతిక్ రోషన్ కి సంబంధించినంత వరకు తారక్ చెడ్డవాడు, వీళ్లిద్దరు కలిసి మంచి చేస్తారనే అనుకుందాం అంటూ ముగింపు వాఖ్యాలుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.