Mahesh Babu vs Mega Fans: ‘మా హీరో గొప్పంటే.. కాదు కాదు.. మా హీరో గొప్పంటూ’ ఫ్యాన్స్ పోట్లాడుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీనే. కానీ సోషల్ మీడియా వచ్చాక, ఫ్యాన్స్ మధ్య ఈ ట్వీట్ వార్ మరీ మితిమీరిపోతుంది. ఈ తరహా ‘ఫ్యాన్ వార్’ తరచుగా చూడాల్సి వస్తోంది. ఇప్పుడు మహేష్ – మెగా అభిమానుల వంతు వచ్చింది. వాళ్ళు రెచ్చిపోయి తిట్టుకుంటున్నారు. కారణం.. ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ సమయంలో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొదటి షో నుంచే ట్విట్టర్ లో సినిమా బాగాలేదు అంటూ దుష్ప్రచారం చేశారు. ఐతే, ఇది ఎవరో కొందరు మాత్రమే చేశారు. పవన్ ఫ్యాన్స్ అందరూ ఇలా చేశారు అనడం భావ్యం కాదు.
అదే విధంగా ఎప్పుడూ లేనిది, మహేష్ సినిమాకు రాజకీయ రంగులు పూలమే ప్రయత్నాలు జరిగాయి. “నేను ఉన్నాను.. నేను విన్నాను” అంటూ జగన్ చెప్పే డైలాగ్ ను, మహేష్ చేత చెప్పించారు. ఈ డైలాగే సర్కారువారిపాట కొంప ముంచింది. ఈ సినిమా రాజకీయ ఊబిలో చిక్కుకునేలా ఈ డైలాగే ఉసి కొల్పింది. మహేష్ నోట జగన్ మాట రావడంతో.. తెలుగుదేశం, జనసేన వర్గాలు బాగా హర్టయ్యాయి. దీంతో ఆయా పార్టీల డై హార్ట్ ఫ్యాన్స్, ‘సర్కారువారిపాట’ సినిమా డిజాస్టర్ అనే టాక్ ను బాగా వ్యాపింపచేశారు. కానీ, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి.. పూర్తిగా వారే నెగిటివ్ టాక్ ను స్పెడ్ చేసినట్లు బయటకు కనిపించింది.
Also Read: Sarkaru Vaari Paata 4 days Collections: సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?
అందుకే, మహేష్ బాబు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేశారు. ‘మీరు మా జోలికివచ్చారు. ముందు ముందు మీకు మోతమోగించక పోతే మేము ఒక అమ్మా అబ్బకు పుట్టినట్లే కాదు’ అంటూ మహేష్ ఫ్యాన్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దానికి, పవన్ ఫ్యాన్స్ కూడా దీటుగానే స్పందిస్తున్నారు. చిలికి చిలికి గాలి వాన అయినట్టు, ఫ్యాన్స్ మధ్య ఈ వాదన కాస్తా పెద్ద గొడవగా మారింది. ట్రోల్స్ రూపంలో ఒకరి ఇమేజ్ ను మరొకరు దెబ్బతీసేలా దారుణమైన ఫోటోలు, కామెంట్స్ పెడుతున్నారు.
నిజానికి మహేష్ బాబుకి అన్ని పార్టీలలో, అలాగే అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. అన్నిటికీ మించి మెగా ఫ్యామిలీతో మహేష్ బాబుకి మంచి అనుబంధం ఉంది. వ్యక్తిగతంగానే కాదు, సినిమాల పరంగానూ మహేష్ – పవన్ ఎంతో స్నేహంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాకు మహేష్ ఎంతో ఇష్టంగా వాయిస్ ఓవర్ చెప్పారు. మెగా హీరోలు చిరు – చరణ్ నటించిన ఆచార్య సినిమాకు కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతకుముందు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఆడియో ఫంక్షన్ కి చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆ సినిమా విజయానికి పునాది వేశారు.
ఇలా స్టార్స్, తమ మధ్య ఎటువంటి భేదభావం లేదని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నా, ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అనారోగ్య పూరిత వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ మధ్య అయితే, ఫ్యాన్స్ మధ్య ఈ సోషల్ మీడియా వార్స్ మరీ ఎక్కువై పోయాయి. నచ్చని హీరో పై యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా ఫ్యాన్స్ పరిణితి చెందాలని, వారి ప్రవర్తనలో మార్పు రావాలని ఆశిద్దాం.
Also Read:Anupama Parameswaran: కొత్త మేకోవర్ తో మెరిసిపోతుంది… ఇక ఛాన్స్ ల వెల్లువే
Recommended Videos