Kannappa and War 2 : ఎన్టీఆర్(Junior NTR) పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఉదయం ‘వార్ 2′(War 2 Movie) మూవీ టీజర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతృప్తి చెందారు కానీ, మూవీ లవర్స్ అంతగా సంతృప్తి చెందలేదు. సినిమాలో VFX షాట్స్ బాగాలేవని కొందరు, ఎన్టీఆర్ లుక్స్ బాగాలేవని మరికొందరు, అన్ని స్పై చిత్రాలకు ఒకే తరహా కథని వాడుతున్నారని మరికొందరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ని నెగటివ్ రోల్ లో చూపించారని ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకో ఎన్టీఆర్ ఈసారి రాంగ్ స్టెప్ వేసాడని కొందరి భావన. బాలీవుడ్ లో కూడా ఈ టీజర్ పై ట్రోల్స్ భారీ గా వస్తున్నాయి. ఇక యూట్యూబ్ లో 24 గడిచిన తర్వాత ఈ టీజర్ కి వచ్చిన వ్యూస్, లైక్స్ చూసి అభిమానులకు నోటి నుండి మాట కూడా రాలేదు.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
24 గంటల్లో తెలుగు వెర్షన్ టీజర్ కి కేవలం 3.15 మిలియన్ వ్యూస్, 2 లక్షల 18 వేల లైక్స్ వచ్చాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కి ఇది చాలా అంటే చాలా పూర్ రెస్పాన్స్ అని అనొచ్చు. హిందీ వెర్షన్ లో మాత్రం ఈ టీజర్ కి 24 గంటల్లో 20 మిలియన్ కి పైగా వ్యూస్, 6 లక్షల 79 వేల లైక్స్ వచ్చాయి. అంటే ఈ సినిమాకు హిందీ లో ఉన్నంత క్రేజ్, తెలుగు లో లేదు అన్నమాట. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎందుకో ఈ సినిమాని సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించలేదు. ఇంతకు ముందు టీజర్స్ విషయం లో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అత్యధిక లైక్స్ రికార్డ్స్, అత్యధిక వ్యూస్ రికార్డ్స్ వంటివి ఆయన ఖాతాలోనే ఉండేవి. అలాంటి సూపర్ స్టార్ సినిమాకు ఇంత తక్కువ రెస్పాన్స్ రావడం మింగుడు పాడనీ విషయం.
పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ కి సరైన బహుమతి ఇవ్వలేదని అందరూ అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ‘కన్నప్ప'(Kannappa Movie) టీజర్ కి 24 గంటల్లో వచ్చిన వ్యూస్ కూడా రాలేదట. కన్నప్ప టీజర్ కి 24 గంటల్లో 4.94 మిలియన్ వ్యూస్ రాగా, లక్షా 83 వేల లైక్స్ వచ్చాయి. అయితే ‘వార్ 2’ తెలుగు టీజర్ కి ఎలాంటి యాడ్స్ వెయ్యలేదని, వేసి ఉండుంటే వేరే లెవెల్ ఉండేదని, యాడ్స్ వేయకపోవడం వల్లే ఈ టీజర్ పెద్ద రేంజ్ కి రీచ్ అవ్వలేదని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని, అవి త్వరలోనే విడుదల చేస్తారని, వాటికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
Also Read : ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!