Homeఎంటర్టైన్మెంట్War 2 : ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతున్న 'వార్ 2' మూవీ టీం..కోట్ల రూపాయిల్లో...

War 2 : ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతున్న ‘వార్ 2’ మూవీ టీం..కోట్ల రూపాయిల్లో నష్టం..అభిమానులు ఆశలు వదిలేసుకోవాల్సిందే!

War 2 : బాహుబలి సినిమా తర్వాత తెలుగు హీరోలంతా పాన్ ఇండియా లెవల్లోనే సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు పాన్ వరల్డ్ లెవల్లో గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ వచ్చిన దేవర యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు కాస్త అసహనంగా ఉన్న మాట వాస్తవమే. ఈ సినిమా తర్వాత కొత్త సినిమాతో ఎన్టీఆర్ భారీ హిట్ కొట్టాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎన్టీఆర్ కూడా దేవర తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హిందీ డెబ్యూ మూవీ వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో ఈ సినిమాపై బిగ్ బజ్ ఏర్పడింది.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి స్ర్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. బిగ్గెస్ట్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమా దేశవాప్తంగా ఆసక్తిగా ఎదరు చూస్తున్న సినిమాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

సినిమా షూటింగ్ ముంబై, అబుదాబి, లండన్ వంటి ఇంటర్నేషనల్ లోకేషన్లలో శరవేగంగా జరుపుకుంటుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నీషియన్లను నియమించుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర యాక్షన్ పరంగా హై రేంజ్ ఎలివేషన్లను అందుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కథలో కీలకమైన ట్విస్ట్‌తో పాటు విలన్ షేడ్స్ ఉన్న పాత్ర ఎన్టీఆర్ ది అని తెలుస్తోంది. ఈ రోల్ వల్ల బాలీవుడ్ మార్కెట్‌లో ఎన్టీఆర్‌కు గుర్తింపు వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే సినిమా అంచనాలు ఎంత పెరుగుతాయో, షూటింగ్ మాత్రం అదే లెవల్లో లేట్ అవుతూ వస్తుంది. గతేడాది మధ్యలో షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ అనేక మార్పులు, మళ్లీ రీషెడ్యూల్‌లు, స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాలు ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉంది. కానీ వాస్తవానికి ఎన్టీఆర్ తాను కేటాయించిన షెడ్యూల్‌ లో పని పూర్తి చేసుకుని ఈ పాటికే కొత్త సినిమా మొదలు పెట్టాల్సి ఉండే.. వార్ 2 ఆలస్యం ఎన్టీఆర్ నటిస్తున్న NTR 31 పై పడుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వార్ 2 షూటింగ్ ప్లాన్ చేసిన షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో.. ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ అవ్వాల్సిన డేట్ కూడా మారిపోయింది.. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఎన్టీఆర్ స్వయంగా అసహనానికి గురయ్యారని.. ఇక ఆలస్యం జరిగితే దాని ప్రభావం తన నెక్ట్స్ ప్రాజెక్టుల పై పడుతుందన్న టాక్ వినిపిస్తుంది.

ఇక ఎన్టీఆర్ ను ప్రతీ సారి రిక్వెస్ట్ చేస్తూ తెగ నస పెడుతున్నారని టాక్ వస్తుంది. ప్రస్తుతం వార్ 2 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను హై టెక్నికల్ వండర్‌గా మలచాలని చూస్తుండడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. కానీ, హీరోల డేట్స్‌లో మార్పులు, తదుపరి ప్రాజెక్టులకు ఇబ్బందిగా మారుతాయి. మరి, ఎన్టీఆర్ NTR 31 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular