https://oktelugu.com/

Live Music: సంగీతం లైవ్ లో వినాలి అని ఉందా? అయితే ఇక్కడికి వెళ్లండి

భాషపై సంబంధం లేకుండా పాటలు వినోదాన్ని పంచుతుంటాయి. ఇలా మ్యూజిక్ లవర్స్ కోసం స్పెషల్ గా ఈవెంట్స్ ఉంటాయని మీకు తెలుసా? కాసేపు ఎంజాయ్ చేయాలి అనుకున్నా.. పార్టీ ప్రియులకు, నగరంలో కచేరీలు, కార్నివాల్స్ నుంచి ఈవెంట్స్ ఉంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 7, 2024 / 03:58 PM IST
    Follow us on

    Live Music: సాంగ్స్ వింటే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని మ్యూజిక్స్ వింటూనే ఉండాలి అనిపిస్తుంది. ఇక ఒక సినిమా హిట్ కావాలంటే అందులోని పాటలు కూడా క్లిక్ కావాల్సిందే. ముందుగా రిలీజ్ అయిన సాంగ్స్ బాగుంటే సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది. అందుకు దర్శక నిర్మాతలు సాంగ్స్ పై మరింత దృష్టి పెడుతుంటారు.అయితే భాషపై సంబంధం లేకుండా పాటలు వినోదాన్ని పంచుతుంటాయి. ఇలా మ్యూజిక్ లవర్స్ కోసం స్పెషల్ గా ఈవెంట్స్ ఉంటాయని మీకు తెలుసా? కాసేపు ఎంజాయ్ చేయాలి అనుకున్నా.. పార్టీ ప్రియులకు, నగరంలో కచేరీలు, కార్నివాల్స్ నుంచి ఈవెంట్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం..

    1.. 10 భారతీయ భాషల్లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు సింగర్ కార్తీక్. దాదాపు 1000కి పైగా పాటలతో సంగీత ప్రపంచంలో టాప్ డైరెక్టర్లతో కలిసి పని చేశారు. ఫిబ్రవరి 24న బౌల్డర్ హిల్స్ సింగర్ కార్తీక్ మ్యూజిక్ ఈవెంట్ జరగనుంది. దీని ధర రూ. 1299.

    2..ముంబైకి చెందిన పాప్ రాక్ సంచలనం సనమ్.. హైదరాబాద్ లో మ్యూజిక్ ఈవెంట్ చేయనున్నారు. ఈయన క్లాసిక్ బాలీవుడ్ పాటలకు కేరాఫ్ అడ్రస్. సనం, సనమ్ పూరి, వెంకీ ఎస్, కేశవ ధనరాజ్ లతో ఈవెంట్ జరగనుంది. దీని ఎంట్రీ ధర రూ. 799

    3..గ్రామీ-విజేత తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ 2004 గ్రామీ అవార్డ్స్ లో తన చారిత్రాత్మక విజయం అందుకున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో సంగీత కచేరి నిర్వహించనున్నారు. మెలోడీ ఆఫ్ రిథమ్ పేరుతో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, నిలాద్రి కుమార్ మ్యూజిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరగనుంది. టికెట్ ధర రూ. 750.

    4..సలామ్ సౌక్ ఎడిషన్ 5లో ఫిబ్రవరి 25న బాలీవుడ్ లెజెండ్ లక్కీ అలీ మ్యూజిక్ ఈవెంట్ జరగనుంది. మ్యాజికల్ హస్కీ వాయిస్ కు పేరుగాంచిన లక్కీ అలీ తన టైమ్ లెస్ క్లాసిక్ లతో ప్రేక్షకులను కట్టిపడేయనున్నారు. ఈ ఈవెంట్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ఇక ఈ టికెట్ ధర రూ. 249.

    5.. సోషల్ మీడియా సంచలనం హైదరాబాదీ స్ట్రీట్ రావట్ కేడెన్ శర్మ ఈవెంట్ కూడా జరగనుంది. హైదరాబాద్ కు చెందని 21 ఏళ్ల రాపర్ కేడెన్ శర్మ ఎమ్ టీవీ హస్టిల్ 3లో అలరించారు. ఇక ఫిబ్రవరి 10న నానాక్రామ్ గూడలోని వన్ గోల్డ్ బ్రూవరీలో ఈవెంట్ జరగనుంది. ఈ టికెట్ ధర రూ. 1000 నుంచి ప్రారంభం.

    కాబట్టి మ్యూజిక్ లవర్స్ ఈ ఈవెంట్స్ ను అసలు మిస్ అవకండి. హైదరాబాద్ సంగీత ప్రియులకు ఈ రిథమ్ ఆఫ్ మ్యూజిక్ ఈవెంట్స్ మరపురాని సంగీత అనుభవాన్ని అందించడం ఖాయం. సో డోన్ట్ మిస్..