Vivek Agnihotri: భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు సినిమాటిక్ సబ్జక్ట్స్. ఈ రెండిటిపై పలు భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. కథ ఒకటే అయినా ఎవరి దృష్టి కోణంలో వారు తెరకెక్కించారు. కొన్ని బాక్సాఫీస్ విజయం సాధించాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇటీవల ఆదిపురుష్ టైటిల్ తో ప్రభాస్ రామాయణ చేశారు. ఆధునిక ధోరణిలో తెరకెక్కిన ఆదిపురుష్ హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. బాక్సాఫీస్ ఫలితం కూడా నెగిటివ్ గా వచ్చింది.
ఆదిపురుష్ చిత్ర యూనిట్ మీద ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి విమర్శలు గుప్పించాడు. కనీస పరిజ్ఞానం, పరిశోధన లేకుండా రామాయణం తీయడం సరికాదు. అలాగే ఎవరిని పడితే వాళ్ళను రాముడిగా జనాలు ఒప్పుకోరని చురకలు వేశాడు. ఆదిపురుష్ చిత్రం పై పరోక్ష విమర్శలు చేసిన అగ్నిహోత్రి మహాభారత ప్రకటించడం చర్చకు దారి తీసింది.
కన్నడ రచయిత పద్మభూషణ్ డాక్టర్. డిఎల్ భైరప్ప ‘పర్వ’ పేరుతో మహాభారతం రాశారు. సంస్కృత మహాభారతానికి తన దృష్టి కోణంలో భైరప్ప ఆధునిక రూపం ఇచ్చాడు. ఈ పర్వ ఆధారంగా అదే టైటిల్ తో వివేక్ అగ్నిహోత్రి మహాభారత తెరక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. ఇది మూడు భాగాలుగా విడుదల కానుంది. ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్ ప్రకటించడం చర్చకు దారి తీసింది.
ది కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా వివాదం రాజేసింది. రాజకీయ ఆరోపణలకు కారణమైంది. కాగా రాజమౌళి మహాభారత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. వివేక్ అగ్నిహోత్రి పర్వ ప్రకటనతో ఆయనకు పోటీ ఇచ్చినట్లు అయ్యింది. ఆదిపురుష్ ఫెయిల్యూర్ అనంతరం… రామాయణ, మహాభారతాలను సౌత్ డైరెక్టర్స్ బెస్ట్. నార్త్ డైరెక్టర్స్ అంత గొప్పగా తెరకెక్కించలేరనే నానుడి బలపడింది.
#Exclusive – HERE IS THE BIG ANNOUNCEMENT
DIRECTOR VIVEK AGNIHOTRI ANNOUNCES FILM ON MAHABHARAT – #PARVA
FILM TO BE MADE IN 3 PARTS
Is Mahabharat HISTORY or MYTHOLOGY?
#IAmBuddha will be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’:
PARVA – AN EPIC TALE… pic.twitter.com/OrUzRkrrwO— Sumit Kadel (@SumitkadeI) October 21, 2023