Chiranjeevi Viswambhara : అంజి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మళ్ళీ గ్రాఫిక్ కంటెంట్ సినిమాల జోలికి వెళ్ళలేదు. కేవలం కమర్షియల్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. అయితే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయన రీ ఎంట్రీ లో ‘విశ్వంభర'(Viswambhara Movie) లాంటి గ్రాఫిక్స్ కంటెంట్ సినిమా చేస్తుండడం తో అభిమానుల్లో ఈ చిత్రం పై మొదట్లో అంచనాలు చాలా భారీగా ఉండేవి. కానీ టీజర్ విడుదల తర్వాత ఆ అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. కారణం అందులో గ్రాఫిక్స్ కంటెంట్ చాలా నాసిరకంగా ఉండడమే. మెగాస్టార్ చిరంజీవి మరియు మూవీ ఆడియన్స్ నుండి వచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ని తీసుకున్నారు. గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చి, సరికొత్త టీం తో గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయించాడు. అందుకు చాలా సమయమే పట్టింది. ఎప్పుడో జనవరి లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, అసలు ఈ ఏడాది లో విడుదల అవుతుందా అనే సందేహాలను కలిగించింది.
ఈ సినిమాలోని గ్రాఫిక్స్ కంటెంట్ నిడివి దాదాపుగా 45 నిమిషాల వరకు ఉంటుంది. రీసెంట్ గానే రీ వర్క్ చేసిన గ్రాఫిక్స్ కంటెంట్ ని మెగాస్టార్ చిరంజీవి చూశాడట. ఈ కంటెంట్ ఆయనకు బాగా నచ్చి సంతృప్తి చెందినట్టు సమాచారం. దీంతో ఫైనల్ VFX కంటెంట్ లాక్ ఐపోయినట్టే. ఓటీటీ డీల్ కూడా ముగిసి చాలా రోజులైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్ తో పాటు, కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నది. సినిమా ఆల్బం మొత్తానికి కీరవాణి సంగీతం అందించాడు, కానీ ఈ స్పెషల్ ఐటెం సాంగ్ ని మాత్రం సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ భీమ్స్ కంపోజ్ చేసాడట. నాగిని సీరియల్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న మౌని రాయ్ ఈ పాటలో మెగాస్టార్ తో కలిసి చిందులు వెయ్యబోతుందట. ఇప్పటికే ఈమె బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించింది. ఈ చిత్రంతో తెలుగు లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదలకు సిద్ధమైనట్టు సమాచారం. అయితే అదే తేదీన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంది. అలాంటి సినిమా ని వాయిదా వేస్తే రచ్చ మామూలు రేంజ్ లో ఉండదు. చిరంజీవి సినిమా అయినా ఈ విషయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరు. కానీ ఈ ఏడాది మిస్ అయితే విశ్వంభర కి వచ్చే ఏడాది సమ్మర్ వరకు మరో స్లాట్ లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో మెగాస్టార్ చిరంజీవి ఓజీ టీం ని వెనక్కి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాడేమో చూడాలి.