Viswak Sen: వెళ్ళి పోమాకే సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్ చిత్రాలతో యూత్ లో మంఛీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. యాక్టింగ్ లో ఎక్కడ తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్. హిట్ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇటీవలే పాగల్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు విశ్వక్ సేన్. ఈ సారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవలే చిత్రాన్ని విశ్వక్ రీమేక్ కేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు ” ఓరి దేవుడా” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ను చిత్రా బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మిథిలా పల్కర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రానికి అశ్వత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవలే గామి అనే సినిమాను విశ్వక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు.
Here's the Cool & Lovely First Look & Motion Poster of Mass ka Dass @VishwakSenActor & @mipalkar starrer #OriDevuda 🦋❤️.
Directed by @Dir_Ashwath
▶️ https://t.co/TdgjqLMF4p#OriDevudaFL #VS6 @leon_james @vidhu_ayyanna @Garrybh88 @vamsikaka @PVPCinema @SVC_official pic.twitter.com/YnCjHkG8eJ
— Sri Venkateswara Creations (@SVC_official) November 9, 2021