Laila Movie : ఈమధ్య కాలం లో ఆడియన్స్ మొత్తం ఏకపక్షం తో గొంతెత్తి ఇదేమి చెత్త సినిమా రా బాబు, దయచేసి పొరపాటున థియేటర్స్ వైపు కూడా చూడకండి అంటూ అడ్డమైన బూతులు తిన్న సినిమా ఏదైనా ఉందా అంటే అది విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన లైలా(Laila Movie) చిత్రం. ఈ సినిమా ట్రైలర్ ని చూసినప్పుడే ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అడల్ట్ కంటెంట్ పేరుతో అత్యంత హేయమైన, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే డైలాగ్స్ పెట్టాడు డైరెక్టర్. దీనికి హీరో విశ్వక్ సేన్ ఎలా ఒప్పుకున్నాడో, నిర్మాత సాహు ఈ కథని నమ్మి అంత బడ్జెట్ ఎలా ఖర్చు చేసాడో అంతు చిక్కడం లేదంటూ విశ్లేషకులు సైతం అసహనం వ్యక్తం చేసారు. ఒకప్పుడు విశ్వక్ సేన్ యూత్ ఆడియన్స్ ని అలరించే విధంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాలు చేసేవాడని, కానీ ఇప్పుడు మాత్రం బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నాడని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ఒప్పదం ప్రకారం ఈ సినిమాని నాలుగు వారాల తర్వాతనే విడుదల ఓటీటీ లో విడుదల చేయాలి, కానీ సినిమాకి ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది, థియేటర్స్ వద్ద ఈగలు తప్ప మనుషులు లేరు. అందుకే మేకర్స్ అనుకున్న తేదీ కంటే ముందే, అంటే ఈ నెలాఖరులో శివరాత్రి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానుంది. అనుకున్న తేదీ కంటే ముందుగా విడుదల చేస్తే, రెండు కోట్లు అదనంగా ఇస్తామని అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇవ్వడం వల్లే ఈ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్ర నిర్మాత సాహు గతం లో బాలయ్య తో ‘భగవంత్ కేసరి’ లాంటి చిత్రాన్ని తీసాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, తమిళం లో విజయ్ లాంటి సూపర్ స్టార్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. అంతటి గొప్ప పేరుని ఈ చిత్రం సంపాదించుకుంది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా తీయబోతున్నాడు. ఇంత పెద్ద సూపర్ స్టార్స్ తో సినిమాలు తీస్తూ, చెత్త ఆలోచనలు ఉన్న ‘లైలా’ లాంటి సినిమాలను ఎలా నిర్మించాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆయన తీరు చూస్తుంటే ఎదో రెండు మూడు కామెడీ సన్నివేశాలు నచ్చి స్క్రిప్ట్ మొత్తాన్ని వినకుండా సినిమాని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఇలా అయితే మనుగడ కష్టమే, ఒక సినిమా ఒప్పుకునే ముందు ఒకటికి పది సార్లు స్క్రిప్ట్ పేపర్స్ చదివి నిర్ణయం తీసుకోవడం లో ఎలాంటి తప్పు లేదు, నిర్మాతలు ఇక నుండి అలా వ్యవహరించాలి.