Vishwak Sen Lady Gate up
Tollywood : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకరు విశ్వక్ సేన్. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనం అందించాలి అని తపన పడే హీరో ఆయన. కేవలం నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా ఆయన కెరీర్ లో ఎన్నో సక్సెస్లు అందుకున్నాడు. ఆయన గత చిత్రం ‘మెకానిక్ రాకీ’ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘లైలా’ చిత్రం వచ్చే నెల వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలై ఆడియన్స్ లో అమితాసక్తిని రేపిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో విశ్వక్ సేన్ అమ్మాయి లాగ కనిపించి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు.
అయితే ఆయన అమ్మాయి గెటప్ లోకి మారేందుకు ఎంత కష్టపడ్డాడో రీసెంట్ గా మేకర్స్ మేకింగ్ వీడియో ని విడుదల చేసారు. ఈ మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూస్తే విశ్వక్ సేన్ క్యారక్టర్ కోసం ఎంత డెడికేషన్ పెడుతాడో అర్థం అవుతుంది. అసలు అమ్మాయి లాగా అతను మారడానికి కారణం ఏమిటి? అనేది తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం ద్వారా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా మన టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి ఇచ్చుకుందాం బేబీ అనే సాంగ్ యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ పాటకు 3 రోజుల్లో నాలుగు మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. విశ్వక్ సేన్ గత చిత్రాల పాటలు మాదిరిగానే ఈ పాట ఉన్నప్పటికీ, ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఉండడంతో హిట్ అయ్యింది.
ఇకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య కి విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరితో కలిసి బయట ఎన్నోసార్లు కనిపించాడు బాలయ్య. ఆ చనువు తోనే విశ్వక్ సేన్ బాలయ్య ని పిలవడం, బాలయ్య కూడా వెంటనే ఒప్పుకోవడం వంటివి జరిగింది. గతంలో పాగల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నందమూరి హీరో ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొని రావడం ‘లైలా’ కి జరుగుతుంది.మరి ఈ సినిమా కూడా అదే ఫలితాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.