https://oktelugu.com/

Vishwak Sen: ‘మాటరాని మాయవా .. మాయజేయు మాటవా’.. విశ్వక్ సేన్ ఆరాటం !

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కొంత సేపటి క్రితం విడుదల చేశారు. ‘మాటరాని మాయవా .. మాయజేయు మాటవా’ అంటూ ఈ పాట మొదలవుతోంది. కాగా ఈ […]

Written By: , Updated On : January 20, 2022 / 01:04 PM IST
Follow us on

Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతుంది. బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కొంత సేపటి క్రితం విడుదల చేశారు. ‘మాటరాని మాయవా .. మాయజేయు మాటవా’ అంటూ ఈ పాట మొదలవుతోంది. కాగా ఈ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లిరికల్ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

Vishwak Sen

Vishwak Sen

Also Read: ‘అఖండ’ అమ్మ సాంగ్ అదరగొడుతుంది !

ఇక హీరో విశ్వక్‌ సేన్‌ రీసెంట్ గా కరోనా వ్యాధికి గురై.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రాకముందు గత కొన్ని రోజులుగా విశ్వక్‌సేన్‌ షూటింగ్ లో పాల్గొన్నాడు. పైగా కరోనా అని తేలింది కూడా ఈ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా షూటింగ్ స్పాట్ లోనే. దాంతో ఈ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు.

అయితే, ఐసోలేషన్ లో చిత్రబృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సాంగ్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక తనకు కరోనా వచ్చిన సంగతి పై విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిన దగ్గర నుంచి నేను డాక్టర్లు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నాను. నిజానికి నేను వ్యాక్సిన్‌ వేయించుకున్నాను. అయినా నాకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి’ అంటూ విశ్వక్‌ చెప్పుకోచ్చాడు.

Also Read: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ !

Falaknuma Das - Arerey Manasa Lyric (Telugu) | Vishwak Sen, Sid Sriram Vivek Sagar | Tharun Bhascker

Tags