Laila Closing Collections: ఈ ఏడాది ప్రారంభం లో ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం నష్టాలతో పలకరించినా, ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం ఆ నష్టాలను పూడుస్తూ గడిచిన పదేళ్ల నుండి ట్రేడ్ చూడని లాభాలను చూపించి చరిత్ర తిరగరాసింది. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తుంది. ఈ సినిమా సక్సెస్ పరంపర ని ఫిబ్రవరి ప్రారంభం లో నాగ చైతన్య ‘తండేల్'(Thandel Movie) చిత్రం ద్వారా కొనసాగించాడు. టాలీవుడ్ లో వరుస హిట్స్ వస్తున్నాయి, మన ఇండస్ట్రీ కి మహర్దశ పట్టుకుంది అని ట్రేడ్ ఆనందించే లోపు విశ్వక్ సేన్(Vishwak sen) హీరో గా నటించిన ‘లైలా'(Laila Movie) చిత్రం పెద్ద షాక్ కి గురి చేసింది. ఈ సినిమాకి విడుదలకు ముందు నుండే చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ట్రైలర్ ని చూసి చాలా వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి, విశ్వక్ సేన్ కెరీర్ లోనే చెత్త సినిమాగా నిలుస్తుందేమో అని అందరూ అనుకున్నారు.
దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన పొలిటికల్ వ్యాఖ్యలు ఈ సినిమాని మరింత చిక్కుల్లోకి నెట్టింది. ఇక విడుదల తర్వాత ప్రేక్షకులు ఈ సినిమా ఎంత చెత్తగా ఉండబోతుందని ఊహించుకున్నారో, అంతకు మించిన చెత్తగా సినిమా ఉండడంతో ప్రేక్షకులు విశ్వక్ సేన్ పై పచ్చి బూతుల తిట్ల దండకాన్ని మొదలెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఒక చిత్రానికి జీరో రేటింగ్స్ వచ్చాయంటే, ఆ ఘనత లైలా కి మాత్రమే చెందుతుంది. విశ్వక్ సేన్ సినిమా అంటే కనీస స్థాయి ఓపెనింగ్స్ ఉండడం సహజం. కానీ ఈ చిత్రానికి క్లోజింగ్ లో ఆయన గత చిత్రం ‘మెకానిక్ రాకీ’ కి మొదటి రోజు వచ్చినంత వసూళ్లు కూడా రాలేదు. ‘మెకానిక్ రాకీ’ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ లైలా చిత్రానికి క్లోజింగ్ లో కేవలం కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
విడుదలకు ముందు ఈ సినిమాకి ప్రమోషనల్ కార్యక్రమాలు ఏ రేంజ్ లో చేసారో మనమంతా చూసాము. హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథిగా పిలిచి చాలా గ్రాండ్ గా చేసారు. ఆ తర్వాత కూడా అనేక ప్రమోషనల్ కార్యక్రమాలు చేసారు. ఈ కార్యక్రమాలు మొత్తం చేయడానికి నిర్మాత సాహు కి అయిన ఖర్చు అక్షరాలా మూడు కోట్ల రూపాయిలు. పెట్టిన ఆ డబ్బులో కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఇంతకు ముందు లాగా విశ్వక్ సేన్ సినిమా అంటే బ్రాండ్ అనే విధమైన ఇమేజ్ కొనసాగి ఉండుంటే, ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ అయ్యేది. కానీ సినిమా సినిమాకి విశ్వక్ సేన్ ఆ బ్రాండ్ ఇమేజ్ ని కోల్పోయాడు.