Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen angry At Reporter: రిపోర్టర్ పై నిప్పులు చెరిగిన హీరో విశ్వక్ సేన్..మర్యాదగా...

Vishwak Sen angry At Reporter: రిపోర్టర్ పై నిప్పులు చెరిగిన హీరో విశ్వక్ సేన్..మర్యాదగా మాట్లాడండి అంటూ వార్నింగ్!

Vishwak Sen angry At Reporter: నేడు విశ్వక్ సేన్(Vishwak Sen) స్వీయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘కల్ట్'(Cult Movie) మూవీ టీజర్ ని విడుదల చేయగా, దీనికి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. ,ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లార్జ్ స్క్రీన్ లో ఏర్పాటు చేశారు. టీజర్ లాంచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వక్ సేన్ ఒక లేడీ రిపోర్టర్ పై నిప్పులు చెరగడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ, నాని గురించి ఏకవచనం తో మాట్లాడడం తో విశ్వక్ సేన్ ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు. ఇంతకీ అసలు ఏమి జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ఇంత మంది జనాలను తీసుకొస్తున్నారు కదా. థియేటర్ మ్యానేజ్మెంట్ ని సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో తెలిసి కూడా ఎలా రానిస్తున్నారు’ అని అడుగుతుంది.

దానికి విశ్వక్ సేన్ సమాధానం చెప్తూ ‘అది థియేటర్ మ్యానేజ్మెంట్ చూసుకుంటుంది కదా, మీకు ఎందుకు?’ అని అంటాడు. ఇవన్నీ ఎందుకు సినిమా గురించి మాట్లాడుకోవచ్చు కదా అని విశ్వక్ సేన్ అనగా, అందుకు రిపోర్టర్ సమాధానం చెప్తూ ‘ఆడియో సరిగా రావడం లేదు, అలాంటప్పుడు మమ్మల్ని కెమెరాలను తీసుకొని రమ్మనడం ఎందుకు’ అని రిపోర్టర్ అడుగుతుంది. అప్పుడు విశ్వక్ సేన్ కి కోపం వచ్చి ‘అక్కా..మొన్ననేమో ఆ హీరో అలా తయారయ్యాడు. ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది అది’ అని అంటాడు. అప్పుడు రిపోర్టర్ దేని గురించి చెప్తున్నారో చెప్తే క్లారిటీ ఇస్తా అని అంటుంది. అప్పుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘మొన్న ఏమో నాని అలా తయారయ్యాడు. ఇప్పుడు నువ్వు ఇలా తయారు అయ్యావు. ముందుగా మీరు మాకు మర్యాద ఇవ్వాలి కదా. మీతో వచ్చిన సమస్య ఏంటంటే, వేలు మావైపు చూపిస్తారు, మేము మీ వైపు వేలు చూపించినప్పుడే సమస్య అవుతోంది. మాట్లాడే ముందు ‘గారు’ అనే పదాన్ని ఉపయోగించడం నేర్చుకోండి.’ అని విశ్వక్ సేన్ ఫైర్ అవుతాడు.

దీనికి రిపోర్టర్ సమాధానం ఇస్తూ ‘మీకు మాకు మధ్య గారు అనేది ఎప్పుడు ఉండదు. ఆ విషయం మీకు తెలియనిది కాదు’ అని అంటుంది. దానికి విశ్వక్ సేన్ నా పదజాలం చాలా మంచిగా ఉంటుంది, మీలా కాదు అని సమాధానం ఇస్తాడు. ఇలా ఆయన మీడియా రిపోర్టర్ తీరుపై విరుచుకుపడడాన్ని ఎక్కువ మంది సోషల్ మీడియా లో సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది మాత్రం విశ్వక్ సేన్ కావాలని గొడవలు పెట్టుకొని సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ గొడవకు సంబంధించిన వీడియో ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular