Vishnupriya: బుల్లితెర యాంకర్స్ లో ఒకరిగా ఉన్న విష్ణుప్రియ క్యాస్టింగ్ కౌచ్ పై గతంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న ఆమె, అది మన నిర్ణయం మీద అభిప్రాయపడి ఉంటుందన్నారు. విష్ణుప్రియ పోరా పోవే షోతో పాప్యులర్ అయ్యింది. సుడిగాలి సుధీర్ తో పాటు ఆమె చేసిన ఈ యూత్ ఫుల్ షో ఒకింత పర్లేదు అనిపించుకుంది. యూట్యూబర్ అయిన విష్ణుప్రియకు బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ తెచ్చింది. బోల్డ్ ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలిచిన విష్ణుప్రియ సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేశారు.
దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ కీలక రోల్ చేశారు. రాఘవేంద్రరావు ఓ ఆఫర్ ఇచ్చినందుకు ఆమె చాలా ఆనందం వ్యక్తం చేశారు. హీరోయిన్ గా చేసే అవకాశం రాకుండానే మరణిస్తానని భయం వేసింది. వాంటెడ్ పండుగాడ్ మూవీతో ఆ కోరిక తీరిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దయా వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. త్వరలో దయ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
కాగా విష్ణుప్రియ గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందన్నారు. ఇది పోవడానికి ఇంకా సమయం పడుతుందని విష్ణుప్రియ అన్నారు. క్యాస్టింగ్ గురించి మాట్లాడుతూ… పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నాకు ఎదురైంది. లైంగిక కోరికలు తీర్చేతే ఆఫర్స్ ఇస్తామన్న వాళ్ళు ఉన్నారు. అయితే నాకు ఇష్టం లేదని ధైర్యంగా చెప్పానన్నారు. మన నిర్ణయం మీదే క్యాస్టింగ్ కౌచ్ ఆధారపడి ఉంటుంది.
ఎవరైనా అవకాశాల కోసం క్యాస్టింగ్ కౌచ్ కి ఇష్టపడితే దాన్ని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్లకు సమ్మతమైతే మనం ఏం చేయలేం అన్నారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. ఇక విష్ణుప్రియ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలు చేసేవారు. కాగా విష్ణుప్రియ తల్లి హెయిర్ స్టైలిస్ట్ అట. కొందరు స్టార్ హీరోయిన్స్ వద్ద పని చేసిందట. అయితే ఆమె కెరీర్లో ఎదగలేకపోయారని ఆమె చెప్పుకొచ్చారు.