Tholi Prema Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సినిమాలలో ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ చిత్రం ఏమిటి అంటే మెజారిటీ మంది చెప్పే ఏకైక సినిమా ‘తొలిప్రేమ’. అప్పటి వరకు కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే ఇండస్ట్రీ లో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో యూత్ ఐకాన్ గా మారాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసిన యూత్ మొత్తం, తమని తాము అద్దం లో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది.
అప్పట్లో ఈ సినిమాని తెలుగు తో పాటుగా హిందీ లో కూడా దబ్ చేసారు. కరుణాకరన్ తమిళ డైరెక్టర్ కాబట్టి ఆయన కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారట. అప్పటికీ పవన్ కళ్యాణ్ తమిళ ఆడియన్స్ కి ఏమాత్రం పరిచయం లేదు. అయినప్పటికీ ఈ చిత్రం తమిళం లో కూడా పెద్ద హిట్ అయ్యిందట.ఈ విషయాన్నీ స్వయంగా డైరెక్టర్ కరుణాకరన్ తెలిపాడు.
ఆరోజుల్లో ఈ చిత్రం కేవలం తమిళ వెర్షన్ నుండి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. తమిళ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని చేరదియ్యాలి అనే ఉద్దేశ్యం తో విడుదల చేసారు. హిట్ అవుతుంది అనుకోలేదు కానీ, అనూహ్యంగా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని చూసిన తర్వాతే తమిళ హీరోలైన అజిత్, విజయ్, శింబు , ధనుష్ , విక్రమ్ వీళ్లంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మారిపోయారట.
ఈ విషయాన్ని తమ్ముడు సినిమా దర్శకుడు అరుణ్ ప్రసాద్ చెప్తాడు. ఇక తెలుగు లో ఈ చిత్రం ఆరోజుల్లో 8 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో అయితే ఒక సునామి ని సృష్టించింది. అంతే కాకుండా టాలీవుడ్ అత్యధిక సార్లు రీ రిలీజైన సినిమా కూడా ఇదేనట. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చెయ్యగా, రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.