Vishnupriya : ఇంస్టాగ్రామ్ వేదికగా సంచనాలు చేస్తుంది విష్ణుప్రియ. బోల్డ్ ఫోటో షూట్స్, వీడియోలతో టెంపరేచర్ పెంచేస్తుంది. తాజాగా మరో హాట్ వీడియోతో అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. విష్ణుప్రియ యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కామెడీ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయ్యింది. పోవే పోరా షోతో యాంకర్ అవతారం ఎత్తింది. సుడిగాలి సుధీర్ తో కలిసి ఆమె ఈ యూత్ఫుల్ షో కి ఆమె యాంకర్ గా వ్యవహరించింది.
యాంకరింగ్ కి దూరమైన విష్ణుప్రియ నటనపై దృష్టి పెట్టింది. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో విష్ణుప్రియ ఓ పాత్ర చేసింది. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు చేశారు. అయితే వాంటెడ్ పండుగాడు నిరాశపరిచింది. అయితే ఇటీవల ఆమె బంపర్ ఆఫర్ కొట్టేసింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన దయ వెబ్ సిరీస్లో జర్నలిస్ట్ రోల్ లో అలరించింది.
దయ సిరీస్లో విష్ణుప్రియది ఫుల్ లెంగ్త్ రోల్. అలాగే దయ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దయ 2 కూడా ఉందని సమాచారం. అందుకే కథను అసంపూర్తిగా ముగించారు. చూస్తుంటే నటిగా విష్ణుప్రియ సత్తా చాటే సూచనలు కలవు. రష్మీ గౌతమ్, అనసూయ సిల్వర్ స్క్రీన్ పై సంచలనాలు చేస్తున్నారు.
అందుకే పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో దారుణమైన ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా జవాన్ చిత్రంలోని రామయ్యా వస్తావయ్యా సాంగ్ కి స్టెప్స్ వేసింది. టైట్ జీన్స్ లో షేక్ ఆడించింది. టెంప్ట్ చేసేలా ఉన్న విష్ణుప్రియ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విష్ణుప్రియ తల్లి హెయిర్ డ్రెస్సర్ అట. శ్రియ, ఆర్తి అగర్వాల్ వంటి స్టార్స్ వద్ద పని చేసిందట. అయితే ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదని విష్ణుప్రియ వాపోయింది. ఇటీవల విష్ణుప్రియ తల్లి కన్నుమూసింది.