Vishnu Priya and Harsha Sai : బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ప్రముఖ సెలెబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసారు. విష్ణు ప్రియ(Vishnu Priya), హర్ష సాయి(Harsha Sai), రీతూ చౌదరి(Ritu Chowdary), టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, కిరణ్ గౌడ్, బన్నీ సన్నీ యాదవ్, యాంకర్ శ్యామలా, సుప్రీత, అజయ్, సన్నీ సుధీర్ వంటి వారిపై కేసులు నమోదు కాగా, గతంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్స్ పై కేసు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఇక నేడు విచారణకు పైన కేసులు నమోదు కాబడిన సెలబ్రిటీస్ మొత్తం పోలీసుల ముందు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. వీరిలో కొంతమంది పరారీలో ఉన్నారు. రీతూ చౌదరి, హర్ష సాయి, సుప్రీత వంటి వారు ఇప్పటికే ఇక మీదట ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయము అంటూ వీడియోలు విడుదల చేసారు.
Also Read : వామ్మో విష్ణు ప్రియలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఫోటోలు చూస్తే తట్టుకోలేరేమో..
బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసినందుకు ఈ సెలబ్రిటీస్ మొత్తం కోట్ల రూపాయిలను సంపాదించారు. వీళ్ళ కారణంగా ఎంతో మంది అమాయకులు లక్షల రూపాయిల ఆస్తులను పోగొట్టుకున్నారు. వాళ్ళ డబ్బులు పోవడానికి ప్రధాన కారణం ఈ సెలబ్రిటీస్ కాబట్టి, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తాన్ని రీ కవర్ చేసి, నష్టపోయిన వాళ్లకు ఇప్పిస్తారా?, లేదా కేవలం అరెస్ట్ చేసి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తారా?..అసలే హైదరాబాద్ పోలీసులు ఈమధ్య కాలంలో చాలా ఫైర్ మీద ఉన్నారు. సాక్షాత్తు అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ నే అరెస్ట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఫైర్ మోడ్ లో ఉన్నారు అనేది. ఇప్పుడు కనీసం ఒక్కరిని అయినా అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైలు లో ఉంచితే కానీ వారిలో శాశ్వతంగా భయం తొలగిపోదని అంటున్నారు నెటిజెన్స్.
ముఖ్యంగా హర్ష సాయి ని అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ చాలా గట్టిగా వినిపిస్తుంది. కారణం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ ఆయన నుండే మొదలయ్యాయి అని అందరూ అంటుంటారు. ఆ రేంజ్ లో ఆయన ఒకప్పుడు రెచ్చిపోయేవాడు. రీసెంట్ గానే ‘నా అన్వేషణ’ అన్వేష్ ఇతనితో ఫోన్ కాల్ సంభాషణ జరిపి జనాల ముందు తప్పు ఒప్పుకుంటూ వీడియో విడుదల చెయ్యి, మళ్ళీ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకు, ఏ టీవీ ఛానల్ చూసిన తర్వాత వెళ్ళేది హర్ష సాయి నే కదా అని అంటున్నారు, ఆ రేంజ్ లో బుక్ అయిపోయావు అని అంటాడు. అన్వేష్ చెప్పాడనో, లేకపోతే తనలో తనకు అవగతం అయ్యిందో తెలియదు కానీ, ఎట్టకేలకు ఇతను అన్వేష్ చెప్పినట్టుగానే వీడియో విడుదల చేశాడు.
Also Read : బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి.. పేదలకు డబ్బులు పంచాడటా? వారేవా ఎంతటి ఉదారత?