Vishnu Manchu: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు ఉన్న వ్యక్తి. శత్రువుకి కూడా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. తోటి వారికీ మర్యాద ఇచ్చే వ్యక్తి. ప్రతి చిన్న వ్యక్తి పై ప్రేమను చూపించే వ్యక్తి. పైగా ఎవరి పై ఎలాంటి సందర్భంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం చిరు స్వభావానికి విరుద్ధం. అయితే, విశ్వాసం చూపించని వ్యక్తుల పై ప్రేమను చూపించడం ఎంతవరకు కరెక్ట్ ? జగన్ సినిమా ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్నా.. థియేటర్ల పై ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్మాతలు ఎంత ఇబ్బంది పడినా..మాట మాత్రం మాట్లాడలేకపోయిన మంచు విష్ణు మెగాస్టార్ పై కామెంట్స్ చేశాడు.

ఇంతకీ మంచు విష్ణు ఏమి మాట్లాడాడు అంటే.. ‘చిరంజీవి, జగన్ ను కలవడం విషయంలో పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్ తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని, మెగాస్టార్ ఏమి చేయలేరని అన్నట్టు మాట్లాడాడు. పైగా రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని కూడా చెప్పుకొచ్చాడు.
Also Read: కీర్తి సురేష్ భుజం మీద వాలిపోయిన మహేష్ !
ఒక్క మంచు విష్ణు మాత్రమే కాదు, చాలామంది చాటుమాటుగా చిరును విమర్శిస్తున్నారు. అయితే వీరందరికీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సమాధానం చెప్పారు. ఏపీ ప్రభుత్వం చిరంజీవిని పిలిచి ఇరికించే బదులు సిని పెద్దలను పిలిచి మాట్లాడాలని భరద్వాజ్ అన్నారు. ‘ఏపీ సీఎం జగన్ తో రేపు చిరంజీవి సమావేశమవుతారు. చిరంజీవిని జగన్ ఎందుకు పిలిచారో నాకు తెలియదు. చిరంజీవి సీఎంతో ఏం మాట్లాడారో.. మోహమాటపడ్డారో తెలియదు.

అసలు ఆయన్ను ఎందుకు విమర్శిస్తున్నారో తెలియదు. సినీపరిశ్రమలో ఐకమత్యం ఉండదు’ అని తెలిపారు.మొత్తానికి చిరంజీవిని ఇరికించొద్దు, చిరంజీవిని తిట్టొద్దు అని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పాల్సి వచ్చింది. అయినా.. ఈ కరోనా కాలంలో మెగాస్టార్ చేసిన సేవ మరో హీరో చేయలేదు. ముఖ్యంగా సినిమా నటీనటులకు, జూనియర్ ఆర్టిస్ట్ లకు ఆయన ఎంతో సేవ చేశారు.
కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ ఆకలి కడుపుతో ఉన్న ప్రతి నటుడికి ప్రతి సాంకేతిక నిపుణిడికి అన్నం పెట్టారు. ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్లు విషయంలో చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. కానీ, సినిమా వాళ్ళు కూడా చిరంజీవి పై విశ్వాసం చూపించడం లేదు. మెగాస్టార్ దగ్గర సాయం తీసుకున్న వారు కూడా చిరంజీవిని విమర్శిస్తున్నారు. ఇలాంటి సినిమా వ్యక్తుల గురించి, వారి మంచి గురించి ఆలోచిస్తూ.. చిరంజీవి అందరి చేత మాటలు పడటం ఎందుకు ? చిరు ఇప్పటికైనా ఆలోచించు.
Also Read: దునియాలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. హిమాలయాల నెత్తిన ఇండియా రికార్డు..!