https://oktelugu.com/

Kannappa Movie : కన్నప్ప సినిమా కోసం మెగాస్టార్ ను రంగంలోకి దింపుతున్న విష్ణు.. మ్యాటరేంటంటే..?

ఇక విష్ణు స్వయంగా వెళ్ళి చిరంజీవికి క్యారెక్టర్ ని చెప్పాడట. ఇక చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే మంచు విష్ణు ఈ సినిమాతో ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 09:23 PM IST
    Follow us on

    Kannappa Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి, అక్కినేని, మెగా దగ్గుబాటి, ఘట్టమనేని, మంచు ఫ్యామిలీల నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళ నాన్నలు గాని, తాతలు గాని హీరోలుగా ఉండటం వల్లే వీళ్ళు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఇండస్ట్రీలో నెపోటిజం కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉందని భావిస్తుంటారు.

    నిజానికి ఒక సినిమా కథ బాగుండి, హీరో యాక్టింగ్ బాగుంటేనే ఆయన హీరోగా ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాల పాటు నిలబడగలుగుతాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఎవరు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వరు. ఈ విషయాన్ని మనం ఇప్పటివరకు చాలా మంది హీరోల విషయంలో చూశాం…ఇక ఇది ఇలా ఉంటే మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నా కూడా హీరోగా నిలబడలేకపోతున్నాడు.

    దానివల్లే ఇప్పుడు రిస్క్ చేసి మరి భక్తకన్నప్ప సినిమాని చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలను సంపాధించుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడమే కాకుండా ఈ సినిమాను మొత్తం స్టార్లతో నింపేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్ నటిస్తున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ, ప్రభాస్ కూడా ఈ విషయం మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. కాబట్టి తన ఫ్రెండ్ అయిన విష్ణు కోసం శివుడిగా ప్రభాస్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

    ఇక ఇప్పుడూ అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమాలో చిరంజీవి కూడా చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏ పాత్ర అనేది ఇంకా పర్ఫెక్ట్ గా తెలియదు. కానీ ఈ సినిమా మీద అంచనాలను పెంచడానికి ఈ సినిమాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాత్ర లో చిరంజీవిని తీసుకుంటున్నట్టు గా తెలుస్తోంది. ఇక విష్ణు స్వయంగా వెళ్ళి చిరంజీవికి క్యారెక్టర్ ని చెప్పాడట. ఇక చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే మంచు విష్ణు ఈ సినిమాతో ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…