https://oktelugu.com/

Madagajaraja Movie: షూటింగ్ పూర్తి అయిన 12 ఏళ్లకు విడుదలైన విశాల్ ‘మదగజరాజ’..కానీ సెన్సషనల్ రెస్పాన్స్..మొదటిరోజు ఎంత వసూళ్లు వచ్చాయంటే!

కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి అయినప్పటికీ కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేని పరిస్థితికి వస్తుంటాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ఇలాంటివి చాలానే చూసాము. మహా అయితే రెండేళ్లు, లేదా మూడేళ్లు ఆగిపోయిన సినిమాలను ఇది వరకు మనం చూసి ఉంటాము. కానీ ఏకంగా 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత విడుదలైన సినిమాని ఎప్పుడైనా మన టాలీవుడ్ లో చూశామా?..

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 08:28 PM IST
    Follow us on

    Madagajaraja Movie: కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి అయినప్పటికీ కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేని పరిస్థితికి వస్తుంటాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ఇలాంటివి చాలానే చూసాము. మహా అయితే రెండేళ్లు, లేదా మూడేళ్లు ఆగిపోయిన సినిమాలను ఇది వరకు మనం చూసి ఉంటాము. కానీ ఏకంగా 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత విడుదలైన సినిమాని ఎప్పుడైనా మన టాలీవుడ్ లో చూశామా?..పైగా అన్నేళ్ల తర్వాత విడుదలైనప్పటికీ కూడా సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకోవడం కలలో అయినా ఊహించామా?, మన టాలీవుడ్ అలాంటి అద్భుతాలు ఇప్పటి వరకు జరగలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం జరిగింది. విశాల్, సంతానం, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మదగజరాజ’ చిత్రం. సుందర్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని 2012 వ సంవత్సరం లో ప్రకటించారు. 2013 వ సంవత్సరం లో ఆ చిత్రం పూర్తి అయ్యింది.

    కానీ ఫైనాన్సియల్ సమస్యల కారణంగా ఈ చిత్రం ఇన్నేళ్లు విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు తమిళనాడు లో గ్రాండ్ గా విడుదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు తమిళనాడు లో ఓపెనింగ్ వసూళ్లు నాలుగు నుండి 5 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ లో విడుదల చేశాడు. ఇటీవలే ఈ మూవీ కి సంబంధించిన చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయగా విశాల్ పాల్గొని మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోవడం, నోటి నుండి సరిగా మాటలు పెగలకపోవడంతో ఆయన అభిమానులు విశాల్ కి ఏమైందో అని కంగారు పడ్డారు.

    ఆయన తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడని వార్తలు వినిపించాయి. అభిమానులు కంగారు పడుతున్న విషయాన్నీ తెలుసుకున్న విశాల్ టీం, ఆయన నాలుగు రోజుల నుండి తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతున్న సమయం లో 103 ఫీవర్ ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన జ్వరం నుండి దాదాపుగా కోలుకున్నాడు. హుషారుగా బయట తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఆయన అలా ఉండడాన్ని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఆయన అభిమానుల్లో ఆనందం మామూలు రేంజ్ లో లేదనే చెప్పొచ్చు. అయితే విశాల్ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ ఎందుకో ఈ చిత్రాన్ని మాత్రం తెలుగు లో దబ్ చేసి విడుదల చేయలేదు. ‘గేమ్ చేంజర్’ తో పాటు మరో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నందునే ఆయన విడుదల చేయలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.