Vishal Legal Shock : తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు విశాల్(Vishal Reddy). ఇప్పుడంటే వరుస ఫ్లాప్స్ కారణంగా ఆయన మార్కెట్ మన టాలీవుడ్ లో బాగా డౌన్ అయ్యింది కానీ, ఒకప్పుడు మాత్రం మన స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇతని సినిమాలకు ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో అప్పట్లో విశాల్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ‘మార్క్ అంటోనీ’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విశాల్ నుండి విడుదలైన చిత్రం ‘మధ గజ రాజ’. 12 ఏళ్ళ క్రితం తెరకెక్కిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అలాంటి సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఇలా 12 ఏళ్ళ క్రితం తెరకెక్కిన సినిమా లేటెస్ట్ గా విడుదలై సూపర్ హిట్ సాధించిన దాఖలాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే లేదు.
Also Read : హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు…ఇలా అయితే కష్టమేనా..?
అయితే ఈమధ్య కాలం లో విశాల్ అనారోగ్యంతో కనిపించడం మనమంతా చూసాము. ఒక ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించడం, మరో ఈవెంట్ లో మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనలతో ఆయన సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యాడు. అయితే ఇప్పుడొక పాత వివాదం లో ఆయనకు హైకోర్టు ఊహించని షాక్ ఇస్తూ తీర్పుని ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే గతం లో విశాల్ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తో ఒక సినిమా చేస్తానని చెప్పి 21 కోట్ల రూపాయిల డబ్బుని తీసుకున్నాడు. అయితే ఆ డబ్బుని తీసుకున్న తర్వాత విశాల్ తన సొంత ప్రొడక్షన్ లో ‘సామాన్యుడు’ అనే చిత్రం చేసాడు కానీ, తమ సంస్థ లో చేయలేదని. మేము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమంటే ఇప్పటి వరకు ఆయన ఇవ్వలేదని, మాకు డబ్బులు ఇచ్చే వరకు ఆయన నిర్మాణ సంస్థ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన రైట్స్ మా వద్దనే ఉండేలా చేయాలని కోర్టు ని ఆశ్రయయించారు.
లైకా సంస్థ పిటీషన్ ని అంగీకరించిన కోర్టు విచారణ చేపట్టి విశాల్ ఎట్టిపరిస్థితి లోనూ లైకా సంస్థకు తీసుకున్న 21 కోట్ల రూపాయిలను వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే అంటూ తుది తీర్పుని ఇచ్చింది. దీనిపై విశాల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. హై కోర్టు తీర్పుని సవాలు చేస్తూ ఆయన సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేస్తాడా?, లేకపోతే ఎలాంటి గొడవ అవసరం లేదని కోర్టు ఆదేశాలను అంగీకరించి 21 కోట్ల రూపాయిలు చెల్లిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విశాల్ ‘తుప్పారి వాలన్ 2’ తెలుగు లో ‘డిటెక్టివ్ 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఆయనే నిర్మాత, దర్శకుడు కూడా. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.