Enemy Movie: హీరో విశాల్… ఎప్పుడు విభిన్న కథాంశాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. పందెం కోడి, పందెం కోడి 2, అభిమన్యు, డిటెక్టివ్ వంటి సినిమాలు తెలుగులో విజయం సాధించాయి. ఈ విధంగా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విశాల్. అయితే తాజాగా విశాల్, ఆర్య కాంబోలో తెరకెక్కించిన చిత్రం ” ఎనిమీ “. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ కి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ఈ ట్రైలర్ లో విశాల్, ఆర్య పర్ఫామెన్స్ లో హైలైట్ అని చెప్పాలి. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించగా… ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాను మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు. మృణాళిని రవి, మమత మోహన్ దాస్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. తెలుగు వాడైన విశాల్ తమిళ్ ఇండస్ట్రి లో రాణిస్తూ అగ్ర హీరోల్లో ఒకడిగా ఉండడం మంచి విషయం అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీన దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాడు-వీడు సినిమా తర్వాత విశాల్, ఆర్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ ” పెద్దన్న ” మూవీ కూడా విడుదల కానుండటం విశేషం.