Vishal And Sai Dhanshika Age Gap: రీసెంట్ గానే తమిళ హీరో విశాల్(Vishal Reddy) ఆగష్టు 29న తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ తమిళ హీరోయిన్ సాయి ధన్సిక(Sai Dhanshika) తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా వీళ్ళు నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ పెద్ద సర్ప్రైజ్. కొద్ది రోజుల క్రితమే సాయి ధన్సిక తాను విశాల్ తో ప్రేమలో ఉన్నాననే విషయాన్నీ మీడియా ముందు చెప్పుకొచ్చింది. వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు, అయినప్పటికీ కూడా ఎలా ప్రేమించుకున్నారు అనే సందేహం అందరిలో పుట్టింది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎలా అయితే కలిసి నటించకపోయిన ప్రేమించి పెళ్లి చేసుకున్నారో , వీళ్లిద్దరు కూడా అదే విధంగా చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడా ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత వయస్సు తేడా ఉన్నోళ్ల మధ్య ప్రేమ ఏంటి అని అందరూ సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
విశాల్ 1977 వ సంవత్సరం ఆగష్టు 29 న జన్మించాడు. ఈ ఏడాది తో ఆయన 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఇక సాయి ధన్సిక విషయానికి వస్తే, ఈమె 1989 వ సంవత్సరం, సెప్టెంబర్ 20 న జన్మించింది. ఈమె వయస్సు ఇప్పుడు 35 ఏళ్ళు. ఇద్దరి మధ్య దాదాపుగా 13 ఎలా తేడా ఉంది. ఇంత వయస్సు తేడా ఉన్న సెలబ్రిటీలు ఈమధ్య కాలంలో ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు. ఆ యాంగిల్ లో చూస్తే వీళ్ళే ఆ క్యాటగిరీలో మొట్టమొదటి జంట కావొచ్చు. ఇది కాసేపు పక్కన పెడితే హీరో విశాల్ నదిగర్ సంఘానికి అధ్యక్షుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. మన తెలుగు లో మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ఎలాగో, తమిళనాడు లో అలా అన్నమాట. మా సంఘానికి భవనం నిర్మించేంత వరకు నేను పెళ్లి చేసుకోనని గతం విశాల్ చెప్పుకొచ్చాడు.
చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డాడు. ఈ ఏడాది తన పుట్టినరోజు కి ఈ భవనం రెడీ అయిపోతుందని అనుకున్నాడు కానీ, ఇంకా రెండు నెలల ప్యాచ్ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో కేవలం నిశ్చితార్థం తో సరిపెట్టాడు. రెండు నెలల తర్వాత భవనం రెడీ అయ్యాక, అందులో తన పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట విశాల్. సాయి ధన్సిక కూడా నదిగర్ సంఘం లో ఒక సభ్యురాలి గానే విశాల్ కి పరిచయం అయ్యిందట. అలా వీళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహం గా మారి ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకునేలా చేసింది. ఇప్పుడు వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. సాయి ధన్సిక కి విశాల్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడంటే, ఆయన అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్న సమయం లో సాయి ధన్సిక ఒక అమ్మలాగా ఆయన వెంట ఉన్నదట. అక్కడి నుండే వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది తమిళ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.