Virata Parvam Team Meets Sarala Family: అది 1990 నక్సలిజం బ్యాక్ డ్రాప్. అక్కడ చిగురించిన ఓ రియల్ ప్రేమ కథనే ‘విరాటపర్వం’ మూవీగా మలిచాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’. రానా హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ విరాటపర్వం మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ‘వెన్నెల’ క్యారెక్టర్ చేసిన సాయిపల్లవి తాజాగా ఆ పాత్రకు అసలు సూత్రధారి అయిన తూము సరళ కుటుంబ సభ్యులను కలిశారు. విరాటపర్వం టీం కూడా వెళ్లి వారిని కలిసింది. సాయిపల్లవి వారి కథ విని ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.

తూము సరళ అనే మహిళా నక్సలైట్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఆమె లైఫ్ లో జరిగిన సంఘటనలకు కమర్షియల్ హంగులను జోడిస్తూ దర్శకుడు వేణు తెరకెక్కించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ కు ప్రేమకథను జోడిస్తూ రూపొందిన ఈ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మీయ వేడుక పేరుతో చిత్రబృందం తూము సరళ కుటుంబం ఉన్న వరంగల్ లో ఓ ప్రచార వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రానా, సాయిపల్లవితోపాటు యూనిట్ మొత్తం హాజరయ్యారు.
విరాటపర్వం సినిమా టీంకు సరళ కుటుంబ సభ్యుల నుంచి ఘన స్వాగతం లభించింది. సరళ పాత్రలో నటించిన సాయిపల్లవిని చూసి సరళ అమ్మగారు భావోద్వేగానికి గురయ్యారు. సాయిపల్లవిని తన కూతురిలాగా భావించారు. ఇంటికి వచ్చిన కూతురికి చీర పెట్టే ఆచారం ఉందని తెలియజేస్తూ సాయిపల్లవికి చీర కూడా పెట్టారు. దీంతో సినిమా మొత్తం భావోద్వేగానికి గురైంది. సాయిపల్లవి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.

తూము సరళ కుటుంబ సభ్యులతో సాయిపల్లవి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విరాటపర్వం సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
– విరాటపర్వం కథ ఇదే..
1990వ దశకంలో విప్లవ భావాలపట్ల ఆకర్షితురాలై నక్సల్ ఉద్యమంలో చేరేందుకు వెళ్లిన ‘తూము సరళ’ కథే విరాటపర్వం స్టోరీ. సరళ ప్రజల కోసం పోరాడేందుకు నక్సల్ బాట పట్టిందనేది ఒక వాదన. అయితే దాంతోపాటు విప్లవ భావాల కన్నా శంకరన్న అనే మావోయిస్టు నాయకుడి పట్ల ఉన్న ఇష్టంతోనే దళంలోకి వెళ్లిందుకు ప్రయత్నించిందనేది మరోవాదన..

తూము సరళ పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఆమెది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యంలో. కమ్యూనిస్టు బావాలతోనే ఆమె నిజామాబాద్ వెళ్లి శంకరన్న దళంలోకి చేరిందని చెబుతారు. అయితే మావోయిస్టు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు కోవర్ట్ ఆపరేషన్లు చేశారని.. సరళపై కూడా శంకరన్న దళం అనుమానంగా ఉండేదనే ప్రచారం ఉంది. సరళను ఇన్ఫార్మర్ అనే కారణంతో మావోయిస్టులే చంపారన్న ప్రచారం ఉంది. అయితే ఇదంతా పోలీసులే మావోయిస్టులను విలన్లుగా చూపించడానికి సరళను చంపి నాటకమాడారని విప్లవకారులు చెబుతారు. సినిమాలో అసలు ఏం క్లైమాక్స్ చూపించారన్నది ట్విస్ట్..
#VirataParvam is based on shocking true incidents inspired by a woman’s life from Warangal. She changed the perception of love in revolution, and #SaiPallavi plays ‘Vennela’ as an ode to the her.
The team met the woman’s family and spent some quality time with them in Warangal. pic.twitter.com/0l6GcZi5Fw
— Suresh Productions (@SureshProdns) June 13, 2022


[…] Also Read: Virata Parvam Team Meets Sarala Family: విరాటపర్వం: రియల్ లైఫ్… […]