Mahesh Babu : సోషల్ మీడియా యుగంలో టాలెంట్ ఉంటే చాలు, దాన్ని ప్రదర్శించడానికి కావలిసినంత పెద్ద ప్లాట్ ఫార్మ్ ఉంది. తమ టాలెంట్స్ తో కొందరు నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు. సింక్ అయ్యేలా వివిధ సినిమాల్లో సీన్స్ కలిపి వీడియో చేయడం సరికొత్త ట్రెండ్. ఇటీవల ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని అద్భుతంగా ఉంటున్నాయి. చూడగానే కనెక్ట్ అయిపోతున్న సోషల్ మీడియా జనాలు వైరల్ చేస్తున్నారు. కృష్ణ మరణం నేపథ్యంలో ఓ అభిమాని ఒక వీడియో రూపొందించాడు. ఆ వీడియోలో తండ్రి కృష్ణ, కొడుకు మహేష్ ఒకే తరహా సీన్స్ కలిపి సింక్ చేసి చూపించారు.

ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా మహేష్ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు తీసుకొని ఎడిట్ చేసి వీడియో రూపొందించారు. మహేష్ ని మహేష్ తిరిగి డబ్బులు అడుగుతున్న ఆ వీడియో భలే కామెడీ ఉంది. దీంతో నెటిజెన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఖలేజా, సర్కారు వారి పాట, భరత్ అనే నేను, బిజినెస్ మాన్, పోకిరి, సరిలేరు నీకెవ్వరు చిత్రాల నుండి మహేష్ సన్నివేశాలు తీసుకొని వన్ బై వన్ సింక్ అయ్యేలా చేసి వీడియో రూపొందించారు. పర్ఫెక్ట్ గా ఉన్న ఆ వీడియో ఆకట్టుకుంటుంది.
మరోవైపు మహేష్ లేటెస్ట్ మూవీపై రోజుకో పుకారు తెరపైకి వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని ప్రాజెక్ట్ నుండి తప్పించారు అంటున్నారు. స్క్రిప్ట్ లో కూడా త్రివిక్రమ్ మళ్ళీ మార్పులు చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రతికూల వార్తలు మహేష్ ఫ్యాన్స్ ని కంగారుకు గురిచేస్తున్నాయి. ఒక షెడ్యూల్ కూడా చేశాక మళ్ళీ రిపేర్స్ ఏంటి అంటున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ మహేష్ తో కనిపిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించిన నేపథ్యంలో అంత్యక్రియలు ముగిసే వరకు మహేష్ తోనే ఉన్నారు.
ఇక కృష్ణ దశ దిన కర్మ జరగాల్సి ఉంది. తండ్రి కృష్ణ అస్థికలు మహేష్ విజయవాడ కృష్ణానదిలో కలిపారు. మహేష్ తో పాటు త్రివిక్రమ్ కూడా వచ్చారు. మహేష్ కుటుంబంలో నెలల వ్యవధిలో మూడు మరణాలు సంభవించాయి. అన్నయ్య రమేష్ బాబు జనవరిలో, అమ్మ ఇందిరా దేవి సెప్టెంబర్ లో, కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. ఈ క్రమంలో మహేష్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటారనే వాదన వినిపిస్తోంది. కాగా వచ్చే ఏడాది మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
Timing 😂💥@urstrulyMahesh pic.twitter.com/W9D3Qhb9mY
— Rámû Røçkzz (@ramu_ramurockzz) November 22, 2022