https://oktelugu.com/

Viral Photo : 15 ఏళ్ళ వయస్సులో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వందల కోట్లకు యజమాని…

తొలి సినిమాతోనే ప్రేక్షకులను కవ్వించి భారీ హీట్ ను సొంతం చేసుకుంది. తన అందంతో, అమాయకమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది.

Written By:
  • Mahi
  • , Updated On : January 9, 2025 / 06:41 PM IST

    Hansika Motwani

    Follow us on

    Viral Photo : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజు చాలామంది సెలబ్రిటీలు, నటీనటులకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.ఇక తమకు ఎంతో ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ ల ఫోటోల కోసం నెటిజన్ లు సోషల్ మీడియా మొత్తం గాలించేస్తూ ఉంటారు. తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఉన్నారు. అలా చిన్న వయసులోనే హీరోయిన్ గా స్టార్ డం సంపాదించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ చిన్నది మాత్రం 15 ఏళ్ల అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కవ్వించి భారీ హీట్ ను సొంతం చేసుకుంది. తన అందంతో, అమాయకమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ఇక కుర్రాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా… ఇలాంటి లవర్ మనకు ఉంటే ఎంత బాగుంటుంది అంటూ ప్రతి కుర్రాడు ఈమె గురించి కలలు కంటాడు. ఈ అందాల అప్సరస ప్రస్తుతం 100 కోట్లు ఆస్తి ఉన్న స్టార్ హీరోయిన్. పాలరాతి శిల్పం లా ఉన్నా ఈమెను చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే. ఈ హీరోయిన్ మరెవరో కాదు దేశముదురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ హన్సిక మోత్వాని. ఈ సినిమాలో హన్సిక హీరో అల్లు అర్జున్ కు జోడిగా నటించింది. తన అందంతో , నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టి పడేసింది.

    పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే దేశముదురు సినిమా సమయంలో హన్సిక వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఇక హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించడం జరిగింది.. దేశముదురు ఆ తర్వాత హన్సిక టాలీవుడ్ లో కంత్రి, బిల్లా, కందిరీగ, మస్కా, పవర్, మై నేమ్ ఇస్ శృతి వంటి పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె తెలుగుతోపాటు తమిళ్, హిందీలో కూడా పలు సినిమాలలో నటించి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

    ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సినిమాలను తగ్గించింది. తన దృష్టి మొత్తాన్ని తమిళ్, హిందీ భాషలపైన పెట్టింది. ఇదిలా ఉంటే హన్సిక మోత్వాన్ని ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ కతురియాతో డిసెంబర్ 4, 2022లో పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ జైపూర్ లో వీరిద్దరి పెళ్లి చాలా ఘనంగా సెలబ్రిటీలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. అయితే సోహెల్ కతురియ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. కాగా హన్సిక మోత్వాన్ని ఆస్తులు దాదాపు రూ. 120 కోట్లకు పైనే అని వార్తలు వినిపిస్తున్నాయి.