Devi Movie: కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఎమ్మెస్ రాజు ప్రొడ్యూసర్ గా వచ్చిన ‘దేవి’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.1999లో వచ్చిన ఈ సినిమా /ను ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు మిస్ అవ్వకుండా చూస్తారు అంటే ఆ సినిమా ఎంతటి గుర్తింపును సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కోడి రామకృష్ణ భారీ గ్రాఫికల్ విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. అంతకుముందు ఆయన ‘అమ్మోరు’ సినిమాతో గ్రాఫిక్స్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మరోసారి దేవి సినిమాతో ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసి పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రేమ లాంటి ఒక కొత్త హీరోయిన్ ని తీసుకొని ఆమె చేత ఈ ప్రయోగం చేయించి సూపర్ సక్సెస్ ని సాధించాడు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకమైనది.
ఆ పాత్ర కోసం ఆఫ్రికన్ వ్యక్తిని చూసినప్పటికి అతనికి సరిగ్గా తెలుగు రాకపోవడంతో డైలాగులను సరిగ్గా చెప్పడం లేదు.ఎక్స్ప్రెషన్స్ ని సరిగ్గా పలికించలేదు. దాంతో ఆఫ్రికన్ విలన్ ను రిజెక్ట్ చేశారు. ఇక మొత్తానికైతే ఆ సినిమాలో విలన్ పాత్రను పోషించిన అబూ సలీం కేరళలో ఎస్ఐ అనే విషయం చాలామందికి తెలియదు.
ఆఫ్రికన్ వ్యక్తిని రిజెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఒకసారి వైజాగ్ కి వెళ్లిన సినిమా యూనిట్ అంతా అక్కడ అబూ సలీం ను చూసి అతని బాడీని చూసి ఫీదా అయిపోయారట. బాడీ బిల్డర్ లా ఉండే అతని బాడీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అందరు అనుకోవడంతో ఎమ్మెస్ రాజు అతని సెలెక్ట్ చేశారట. మొత్తానికైతే ఈ సినిమాలో అతని విలనిజం చాలా వైల్డ్ గా ఉంటుంది. ఇక తనకు బొమ్మాళీ రవిశంకర్ డబ్బింగ్ చెప్పడం విశేషం…
మొత్తానికైతే దేవి సినిమా కోడి రామకృష్ణ కెరియర్ లోనే ది బెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. అయితే అప్పటి విషయాలన్నింటిని ప్రముఖ దర్శకుడు అయిన దేవి ప్రసాద్ మీడియాతో పంచుకున్నాడు. అప్పుడు అతను కోడి రామకృష్ణ దగ్గర కో-డైరెక్టర్ గా పనిచేయడంతో ఆ విషయాలన్నింటిని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం …ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతుంది…