Homeఎంటర్టైన్మెంట్Thangalan Teaser Review : తంగలాన్ టీజర్ రివ్యూ : రా అండ్ రస్టిక్ రోల్...

Thangalan Teaser Review : తంగలాన్ టీజర్ రివ్యూ : రా అండ్ రస్టిక్ రోల్ లో విక్రమ్, కథలో అసలు ట్విస్ట్ అదే!

Thangalan Teaser Review : విక్రమ్ దేశం మెచ్చిన నటుల్లో ఒకరు. ఇక డార్క్ అండ్ రస్టిక్ డ్రామాలకు దర్శకుడు పా రంజిత్ పెట్టింది పేరు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ గెటప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుంది. ఆటవిక జాతికి చెందిన డీగ్లామర్ రోల్ లో ఆయన గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు. పాత్రల గెటప్స్, సినిమా నేపథ్యం సినిమాకు ప్రచారం తెచ్చిపెట్టింది.

నేడు తంగలాన్ టీజర్ విడుదల చేశారు. టీజర్లో కథపై ఒక హింట్ ఇచ్చారు. ఇది బంగారం కోసం జరిగే యుద్ధం అని అంచనా వేయవచ్చు. ఓ ఆటవిక జాతి నివసించే ప్రాంతంలో దొరికే బంగారంపై విదేశీయులు కన్నేస్తారు. వారి స్వార్థం కోసం అమాయక జనాలను బలి చేయాలని చూస్తారు. వారి బానిస సంకెళ్ళ నుండి విముక్తి కోసం తెగలోని ఒకడు తిరగబడతాడు. అందరినీ కూటగట్టి యుద్దానికి సిద్ధం అవుతాడు.

తమకంటే బలవంతులైన వారిపై తంగలాన్ పోరాటం ఎలా సాగింది? అతడు తనను, తన జాతిని కాపాడుకున్నాడా? అన్నదే కథలో ట్విస్ట్. విక్రమ్ పాత్ర మొరటుగా ఉంది. రా అండ్ రస్టిక్ రోల్ లో విక్రమ్ జీవించినట్లు ఉన్నారు. గతంలో విక్రమ్ శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాల్లో ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసిన మెప్పించాడు. తంగలాన్ గా విక్రమ్ మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

కబాలి, కాలా, సర్పట్టా చిత్రాలతో పా రంజిత్ చిత్ర పరిశ్రమ దృష్టికి ఆకర్షించాడు. అప్పట్లో కబాలి అత్యంత హైప్ మధ్య విడుదలైంది. వసూళ్ళ పరంగా కూడా భేష్ అనిపించింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి, పశుపతి కీలక రోల్స్ చేస్తున్నారు. కే ఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ఉన్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 2024 జనవరి 26న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

Thangalaan - Official Teaser  | Chiyaan Vikram | K E Gnanavelraja | Pa Ranjith | G V Prakash Kumar

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version