Vikram OTT Update: ఇటీవల విడుదల అయిన కమల్ హస్సన్ విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఏ స్థాయిలో శాసిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా..ఆ అంచనాలను మొదటి రోజు మొదటి ఆట నుండే అందుకోవడం లో సక్సెస్ అయ్యింది..అభిమానులు ఎంతోకాలం నుండి కమల్ హాసన్ ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ కొడితే బాగుండును అని ఎదురు చూస్తున్న సమయం లో కరెక్ట్ గా విక్రమ్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తగలడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి..ఇటీవల పొలిటికల్ ఫెయిల్యూర్ తో ఢీలాపడిన కమల్ హాసన్ కి ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి..కేవలం హీరో గా మాత్రమే కాదు..ఈ సినిమా ద్వారా నిర్మాతగా కూడా ఆయన భారీ లాభాలను అర్జించాడు..దశావతారం సినిమా తర్వాత కమల్ హాసన్ కి ఈ స్థాయి హిట్టు లేదు..మధ్యలో విశ్వరూపం వంటి సినిమాలు వచ్చినప్పటికీ కూడా, అవి కమల్ హాసన్ రేంజ్ బ్లాక్ బస్టర్ కాదు..ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేసే కమల్ హాసన్, కమర్షియల్ సినిమాలకు దూరం అయ్యి కాస్త యూత్ మరియు మాస్ ఆడియన్స్ కి దూరం అయ్యాడు..ఒక్కసారి సరైన కమర్షియల్ హిట్ పడితే కమల్ హాసన్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి లేటెస్ట్ ఉదాహరణ విక్రమ్ సినిమా.

Also Read: AP SSC Results: టెన్త్ పూర్ రిజల్ట్స్.. కొవిడ్ కారణం చెప్పి తప్పించుకున్న ప్రభుత్వం
ఇది ఇలా ఉండగా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ప్రేక్షకులు OTT కి బాగా అలవాటు పడిపోయారు..ఎలాగో మూడు వారాలు దాటితే OTT లో వచ్చేస్తుంది కదా, ఇక థియేటర్స్ లో చూడాల్సిన అవసరం ఏంటి అనే బద్ధకం చాలా మందిలో వచ్చేసింది..అందుకే ఈ సినిమా ని OTT లో ఆరు వారాల తర్వాతే విడుదల చెయ్యాలి అని అగ్రిమెంట్ చేసుకుంది అట ఆ మూవీ టీం..ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ వాళ్ళు భారీ మొత్తం మీద కొనుగోలు చేసారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ తూఫాన్ సోమవారం రోజు కూడా కొనసాగుతూనే ఉంది..కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 164 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతుంది..అన్ని కలిసి వస్తే ఈ సినిమా రజినీకాంత్ హీరో గా నటించిన రోబో 2 .0 కలెక్షన్స్ ని కూడా దాటేస్తుంది అని అంచనా వేస్తున్నారు..ఇప్పటి వరుకు ఈ సినిమా వసూళ్లను ఏ తమిళ హీరో కూడా ముట్టుకోలేకపొయ్యాడు..అలాంటిది కమల్ హాసన్ అతి తేలికగా ఈ సినిమా వసూళ్లను అందుకుంటాడు అని ట్రేడ్ వర్గాల అంచనా..మరి కమల్ హాసన్ బాక్స్ ఆఫీస్ ఆకలి కి ఇంకా ఎన్ని రికార్డ్స్ బలి అవుతాయో చూడాలి.
Also Read: Nagababu Assets: నాగబాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్.. టీవీ షోలతోనే సంపాదన పెరిగిందా?
Recommended Videos
[…] […]