Chatrapathi: ఛత్రపతి కథను ఆ స్టార్ హీరో ను దృష్టి లో పెట్టుకొని రాసుకున్న విజయేంద్ర ప్రసాద్…

విజయేంద్రప్రసాద్ రాసుకున్న ఛత్రపతి కథని మొదట విక్టరీ వెంకటేష్ తో చేద్దామని అనుకున్నారట, కానీ సింహాద్రి సినిమాకి ముందే రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. కాబట్టి ఈ సినిమాని ప్రభాస్ తో చేద్దామని రాజమౌళి విజయేంద్రప్రసాద్ కి చెప్పాడట ఇక దాంతో ఆయన కూడా ఓకే అన్నాడు.

Written By: Gopi, Updated On : January 24, 2024 9:56 am

Chatrapathi

Follow us on

Chatrapathi: ఇండియాలో సినిమా కథలను రాయగలిగే రైటర్లు ఎంత మంది ఉన్న కూడా అందులో విజయేంద్ర ప్రసాద్ మొదటి స్థానం లో ఉంటాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టాయి. ఇక బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండియన్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే రాజమౌళి వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్ కావడంతో ఆయన తీసే ప్రతి సినిమాకి కథని విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తారు.

దానివల్లే వీళ్ళిద్దరి మధ్య వేవ్ లెంత్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అయి రాజమౌళి ఎలాంటి కథలైతే కోరుకుంటున్నాడో అలాంటి కథలను విజయేంద్రప్రసాద్ ఇస్తూ ఉంటాడు. దీనివల్లే వీళ్ళ కాంబినేషన్ భారీ స్థాయిలో సక్సెస్ అయింది.ఇక విజయేంద్రప్రసాద్ రాసుకున్న ఛత్రపతి కథని మొదట విక్టరీ వెంకటేష్ తో చేద్దామని అనుకున్నారట, కానీ సింహాద్రి సినిమాకి ముందే రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. కాబట్టి ఈ సినిమాని ప్రభాస్ తో చేద్దామని రాజమౌళి విజయేంద్రప్రసాద్ కి చెప్పాడట ఇక దాంతో ఆయన కూడా ఓకే అన్నాడు.

కానీ అయిన విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మాత్రం వెంకటేష్ ని దృష్టిలో ఉంచుకొని కథ రాసుకున్నట్టుగా ఒక సందర్భంలో తెలియజేశాడు. ఎందుకంటే అప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల్లో వెంకటేష్ మాత్రమే సెంటిమెంట్ సినిమాలు చేసేవాడు. ఇక ఈ సినిమా కూడా తల్లి సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. కాబట్టి వెంకటేష్ కి అయితే బాగుంటుందని రాసుకున్నారంటా, కానీ చివర్లో రాజమౌళి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చి ప్రభాస్ తో ఈ సినిమా తీసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ న్యూస్ తెలిసిన తర్వాత వెంకటేష్ అభిమానులు ఈ సినిమా వెంకటేష్ కి కనక పడుంటే ఆయన రేంజ్ మారిపోయేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాకి కథ ఇస్తున్నాడు.ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదికి కూడా వెళ్ళబోతుంది. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో ది బెస్ట్ రైటర్ గా గుర్తింపు పొందాలని విజయేంద్రప్రసాద్ చూస్తున్నాడు…