Vijay: తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు మనకు కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) మాత్రం గుర్తుకు వచ్చేవాడు. సుమారుగా మూడు దశాబ్దాల పాటు తమిళనాడు లో అసలు పోటీ అనేదే లేని హీరో గా ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు సూపర్ స్టార్. మన టాలీవుడ్ లో ఎలా అయితే నాన్ రాజమౌళి రికార్డ్స్ అని ఇప్పుడు పిలుస్తున్నారో, అలా అప్పట్లో నాన్ రజినీకాంత్ రికార్డ్స్ అని పిలిచే వారు. ‘కబాలి’ చిత్రం వరకు రజినీకాంత్ రేంజ్ అలా ఉండేది. కానీ ‘కబాలి’ తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా పడిపోయింది. ఆయన స్థానంలోకి అజిత్, విజయ్ లు వచ్చేసారు. ఒకప్పుడు 8 ఏళ్ళ క్రితం అజిత్(Thala Ajith), విజయ్(Thalapathy Vijay) మధ్య బాక్స్ ఆఫీస్ వార్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది. ఒకప్పుడు రజినీకాంత్ తమిళనాడు లో ఏ స్థానంలో ఉండేవాడో, ఆ స్థానంలోకి విజయ్ వచ్చేశాడు.
Also Read: వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?
ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, తమిళనాడు లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 5 చిత్రాల లిస్ట్ తీస్తే అందులో విజయ్ సినిమాలు నాలుగు ఉండగా, అజిత్ సినిమా కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా టాప్ 5 లో కాదు, కనీసం టాప్ 10 లో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. మొదటి స్థానం లో 36 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ తో విజయ్ ‘బీస్ట్’ చిత్రం మొదటి స్థానంలో నిలబడగా, 35 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ తో ‘లియో’ చిత్రం రెండవ స్థానంలో నిల్చుంది. అదే విధంగా విజయ్ ‘సర్కార్’ చిత్రం 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో మూడవ స్థానంలో నిలబడగా, గత ఏడాది విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం 31 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లతో నాల్గవ స్థానం లో నిల్చింది.
పైన ప్రస్తావించిన నాలుగు సినిమాలు విజయ్ సినిమాలే అవ్వడం గమనార్హం. ఇక ఐదవ స్థానంలో అజిత్ నటించిన ‘వలిమై’ చిత్రం 28 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ తో నిలబడగా, ఆరవ స్థానంలో రీసెంట్ గా విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం 28 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ తో నిల్చింది. ఇక ఆ తర్వాత 7 వ స్థానంలో 26 కోట్ల 35 లక్షల రూపాయలతో పొన్నియన్ సెల్వన్ 1 చిత్రం నిలబడగా, విజయ్ బిజిల్ చిత్రం 26 కోట్ల 50 లక్షలతో 8వ స్థానంలో నిల్చింది. ఇక 9 వ స్థానంలో రెండు నెలల క్రితం విడుదలైన అజిత్ ‘విడాముయార్చి’ చిత్రమ్ 26 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లతో నిల్చింది. ఓవరాల్ గా టాప్ 10 లో విజయ్ సినిమాలు 5 ఉండగా, అజిత్ వి మూడు సినిమాలు ఉన్నాయి.