Vijay Sethupathi Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్…ఒకప్పుడు ఆయన నుంచి సినిమా వస్తోంది అంటే చాలు అందులో పంచ్ డైలాగులతో పాటు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసే అంశాలు పుష్కలంగా ఉండేవి…మూడు నెలల్లో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న ఘనత కూడా తనకే దక్కుతోంది. అలాంటి పూరి జగన్నాథ్ గత కొన్ని రోజుల నుంచి తన పూర్తి ఫామ్ ను కోల్పోయాడు. అయినప్పటికి వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత రెండు సినిమాలు అతనికి డిజాస్టర్లను మిగిల్చినప్పటికి ఇప్పుడు చేస్తున్న సినిమాతో మరోసారి సక్సెస్ లను సాధిస్తానని ఒక దృఢ సంకల్పంతో పూరి జగన్నాథ్ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ప్రస్తుతం విజయ్ సేతుపతి ని లీడ్ రోల్ లో పెట్టి ఆయన చేస్తున్న ‘బెగ్గర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది… రీసెంట్ గా వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సెట్ లో లాస్ట్ డే షూట్ ని కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ తో కలిసి మాట్లాడుతుంటే చార్మి వీడియో కాల్ చేసింది. అందులో విజయ్ సేతుపతి ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే అయినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను అంటూ ఆయన చెప్పిన ఆన్సర్ ఫన్నీ గా ఉండటమే కాకుండా అందరిని ఆకర్షిస్తోంది.
ఇక చార్మి మీరు నిజంగానే సినిమా షూటింగ్ మిస్ అవుతున్నారా? ప్రామిస్ వేసి చెప్పండి అనగా విజయ్ మాత్రం ప్రామిస్ ఎందుకు లేండి అంటూ మాట్లాడిన మాటలు నవ్వులు పూయిస్తున్నాయి. అలాగే పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి విజయ్ సేతుపతి మీ వర్క్ సూపర్ సార్ అంటూ చెబుతూనే మీ జాకెట్ బాగుంది అని చెప్పిన మాటలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని అలరిస్తున్నాయి.
అలాగే విజయ్ సేతుపతి సెట్ లో ఎంత జోవియల్ గా ఉంటాడో తెలపడానికి దీన్ని ఒక ఉదాహరణగా వాడుకోవచ్చు. మొత్తానికైతే విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి అతని కెరియర్ లోనే ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుందని తన భావిస్తున్నాడట.
మొత్తానికైతే ఆయన అనుకున్నట్టుగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతోంది. లేకపోతే మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ని కూడా వదలని పూరి జగన్నాథ్ వరుస అప్డేట్లను ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…
What a journey it has been ❤️#Purisethupathi SHOOT COMPLETED
Every member of the cast and crew poured their soul into making this film something very special
Major updates are coming your way… very soon✨
— Charmme Kaur (@Charmmeofficial) November 24, 2025