https://oktelugu.com/

Vijay Leo Collections : లియో ఫస్ట్ డే కలెక్షన్స్… రజినీకాంత్ రికార్డు అవుట్! ఎన్ని కోట్లు వసూళ్లంటే?

లోకేష్-విజయ్ బెస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అయితే చిత్ర ఫలితం అప్పుడే అంచనా వేయలేం. ఫెస్టివల్ కలిసొచ్చే అవకాశం ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2023 9:59 pm
    Follow us on

    Vijay Leo Collections : ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి కూడా లియో రేంజ్ హైప్ ఏర్పడలేదు. విజయ్ వంటి స్టార్ హీరోతో విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ మూవీ అనగానే అంచనాలు ఆకాశానికి చేరాయి. దానికి తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. వరల్డ్ వైడ్ లియో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక్క గంటలో 80000 టికెట్స్ సేల్ అయినట్లు బుక్ మై షో ప్రకటించింది. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ లియో విడుదలైంది. ఫస్ట్ షో నుండే లియోకి మిక్స్డ్ టాక్ దక్కింది. యాక్షన్, సస్పెన్సు, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నా.. అంచనాలు అందుకోలేదు. లోకేష్ కనకరాజ్ మార్క్ మిస్ అయ్యిందన్న వాదన వినిపించింది.

    ఆల్రెడీ భారీగా ఆన్లైన్ బుకింగ్ జరిగింది. అలాగే రివ్యూస్ తో సంబంధం లేకుండా జనాలు లియో చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ క్రమం రికార్డు ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డు నమోదు అయ్యింది. వరల్డ్ వైడ్ లియో రూ. 115 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటి వరకు రజినీకాంత్ 2.0 పేరిట ఉన్న రూ. 112 కోట్ల రికార్డు విజయ్ లియో బ్రేక్ చేసింది. ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా నిలిచింది.

    తమిళనాడులో రూ. 32 కోట్లు, కేరళలో రూ. 12.5 కోట్లు, ఆంధ్రా/తెలంగాణా రూ. 17 కోట్లు, కర్ణాటక రూ. 14.5 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు అంచనా. చెన్నైలో దాదాపు 1176 షోలు పడగా 86% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ట్రెండ్ చూసిన ట్రేడ్ వర్గాలు లియో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. అది నిలబెడుతూ లియో అంచనాలకు మించి వసూలు చేసింది.

    లియో మూవీలో విజయ్ కి జంటగా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ సంగీతం అందించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మూవీ తెరకెక్కింది. పాజిటివ్ టాక్ దక్కి ఉంటే లియో మూవీ వసూళ్లు అంచనాలకు కూడా అందేవి కావు. లోకేష్-విజయ్ బెస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అయితే చిత్ర ఫలితం అప్పుడే అంచనా వేయలేం. ఫెస్టివల్ కలిసొచ్చే అవకాశం ఉంది.