Keerthy Suresh: పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు కీర్తి సురేష్(Keerthy Suresh). అందం తో పాటు, అద్భుతమైన అభినయం గల నటి. అందుకే ఆమె నటనకు గాను ఉత్తమ నటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు ని కూడా అందుకుంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లో నేషనల్ అవార్డు ని అందుకునే రేంజ్ కి ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ ఫిల్మోగ్రఫీ ని చూసుకుంటే, ఎదో హీరో పక్కన నాలుగు స్టెప్పులు వేసి, కనిపించకుండా పోయే విధంగా ఉండదు. నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఇంత కాలం చేస్తూ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 28 న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ కీర్తి సురేష్ ని ఇరకాటం లో పెట్టే ప్రశ్న వేసాడు. గతం లో ఈమె ఒక తమిళ ఇంటర్వ్యూ లో చిరంజీవి(Megastar Chiranjeevi) కంటే విజయ్(Thalapathy Vijay) బెస్ట్ డ్యాన్సర్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పట్లో సోషల్ మీడియా మొత్తం ఈ వ్యాఖ్యలకు అట్టుడికిపోయింది. మెగా అభిమానులంతా కీర్తి సురేష్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. అయితే ఈ అంశం పై నేడు రిపోర్టర్ కీర్తి సురేష్ వద్ద ప్రస్తావించగా, ఆమె ఇచ్చిన సమాధానం మరోసారి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘ఇది ఎవరు బెటర్ అని చెప్పడం కాదు అండీ. చిరంజీవి గారికి కూడా తెలుసు నేను విజయ్ గారికి ఎంత పెద్ద అభిమాని అనేది. చిరంజీవి గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి పని చేసిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను చిరంజీవి గారితో సరదాగా సంభాషిస్తున్నప్పుడు కూడా ఈ విషయాన్నీ చెప్పాను. ఒకరోజు నాతో సెట్స్ లో నీకు ఎవరి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అని అడిగారు, నేను విజయ్ డ్యాన్స్ కి ఫ్యాన్ అని చెప్పాను. ఇలా నేను చెప్పినప్పుడు చిరంజీవి గారు ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నారు. చిరంజీవి గారు ఇండియా లోనే ది గ్రేట్ స్టార్. ఆయనతో మా అమ్మ గారు కూడా నటించారు. ఆయన్ని తగ్గించి మాట్లాడే ఉద్దేశ్యం నాకు అసలు లేదు’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.
I’ve said what I felt. #MegastarChiranjeevi garu himself knows that I’m a big fan of #ThalapathyVijay garu. I’m sorry if I’ve hurt fans
It feels so sad that when I can’t say what I feel sometimes.
– #KeerthySuresh about the best dancer debate
— (@BheeshmaTalks) November 26, 2025