Pushpa 3 : సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిలో తనదైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా భారీ విజయాన్ని కూడా సాధించింది. 900 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మరి ‘పుష్ప 2′(Pushpa 2) ఈ రేంజ్ లో సక్సెస్ అయిన తర్వాత ‘పుష్ప 3’ (Pushpa 3) మీద దర్శక నిర్మాతలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కథని కూడా సుకుమార్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…మరి విజయ్ నటించే పాత్ర ఏంటి ఆయన ఈ సినిమాకి ఏ రకంగా ఉపయోగపడబోతున్నాడు పుష్ప రాజ్ కి తనకి ఏదైనా విభేదం ఉండబోతుందా? లేదంటే పాజిటివ్ పాత్రలోనే అతను నటించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సపరేట్ గా ఒక సినిమా వస్తుందంటూ అప్పట్లో అనౌన్స్ చేసినప్పటికి ఆ సినిమా కార్యరూపం దాల్చడం లేదు.
దాంతో పుష్ప 3 సినిమాలోనే విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అంటు వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి సినిమా యూనిట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2027 వ సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి విజయ్ దేవరకొండ పుష్పరాజ్ మధ్య ఒక పెద్ద గొడవ జరుగబోతుందట.
దాంతో వీళ్లిద్దరి మధ్య పోటీ నెలకొననున్నట్టుగా తెలుస్తోంది…అసలు విజయ్ దేవరకొండ పాత్ర ఈ సినిమాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది. తద్వారా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాను తలదన్నే రీతిలో పుష్ప 3 సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాని కనక భారీ రేంజ్ లో తీసినట్లైతే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…