Vijay Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి చిత్రాలతో క్లాసిక్ హిట్ కొట్టి ఎలాంటి పాత్రైనా ఇట్టే ఒదిగిపోతానంటు నిరూపించాడు. ఈ రెండు సినిమాల్లో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇప్పటికీ టాక్ వినిపిస్తుంటుంది. కానీ, తనకు విజయ్ ఒక ఫ్రెండ్ మాత్రమేనని రష్మిక ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. తాజాగా, వీరిద్దరు కలిసి ముంబయిలో డేట్‌కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కాగా, విజయ్ సోషల్‌మీడియా వేదికగా ఓ ఫొటో పోస్ట్ చేస్తూ.. తనకు తాగుడు బాగా ఎక్కువైందని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఫొటో యాడ్ చేసి మరి.. గత వారం రోజులుగా మద్యపానంలో మునిగితేలుతున్నట్లు కామెంట్ పెట్టాడు విజయ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: ‘అఖండ’ విజయం కూడా ఆమెకు కలిసి రాలేదు !
https://www.instagram.com/p/CXvCSwHhV_S/?utm_source=ig_web_copy_link
కాగా, విజయ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా లైగర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా కనిపించనుండగా.. మైక్‌టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: ఆగ్రహం మీదున్న పవన్ ఫ్యాన్స్.. వారికి ఏం సమాధానం ఇస్తారు..?