Homeఎంటర్టైన్మెంట్Saheeba Song: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్, ఏమిటీ 'సాహిబా'? మీరు చూసేయండి!

Saheeba Song: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్, ఏమిటీ ‘సాహిబా’? మీరు చూసేయండి!

Saheeba Song: విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీలో ఆయన ఓ ఇంటెన్స్ పోలీస్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో ఆయన నటించారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ జస్లీన్ రాయల్ రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్ లో ఆయన భాగమయ్యారు.

సాహిబా టైటిల్ తో ఈ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశారు. సాహిబా ఆల్బమ్ ని జస్లీన్ రాయల్ కంపోజ్ చేశారు. స్టెబిన్ బెన్, జస్లీన్ రాయల్ కలిసి పాడారు. ఈ సాంగ్ కి ప్రియా సరియా, ఆదిత్య శర్మ లిరిక్స్ అందించారు. ఒక అంతులేని ప్రేమకథను తెలియజేసేలా సాహిబా ఆల్బమ్ రూపొందించారు. రాయల్ ఫ్యామిలీ యువతిని ప్రేమించిన ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ ఆ సాంగ్ లో కనిపిస్తున్నారు. రాధికా మదన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా ఈ ఆల్బమ్ లో నటించారు.

పాట అద్భుతంగా ఉంది. మనసులు దోచేస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇది ట్రీట్ అనడంలో సందేహం లేదు. VD 12 విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఇదొక చిన్న కానుక. మరోవైపు విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయనకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ విజయాలు దక్కడం లేదు.

విజయ్ దేవరకొండ గత చిత్రం ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం పై విపరీతమైన నెగిటివిటీ నడిచింది. నిర్మాత దిల్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ది ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. VD 12తో ఆయన స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జంటగా శ్రీలీల నటిస్తుంది. రామ్ చరణ్ చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళింది. మరి గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి..

 

RELATED ARTICLES

Most Popular