Vijay Deverakonda Rashmika Mandanna Wedding: చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట రీసెంట్ గానే మీడియా కి దూరం గా, బంధు మిత్రుల సమక్ష్యంలో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ విషయం పై అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఎందుకు వీళ్ళు ఇంకా ఈ విషయాన్నీ రహస్యంగా ఉంచుతున్నారో వాళ్ళకే తెలియాలి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత అయినా అభిమానులకు చెప్తారా?, లేదంటే ఇది కూడా రహస్యంగా కానిచేస్తారా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. కానీ వీళ్ళ పెళ్ళికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీళ్లిద్దరు వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం.
అందుకోసం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ ని కూడా బుక్ చేశారట. బంధు మిత్రుల సమక్ష్యం లో, ఇండస్ట్రీ కి సంబంధించిన వారిలో కేవలం విజయ్ దేవరకొండ కి బాగా పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వివాహ మహోత్సవం లో పాల్గొంటారట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. అయితే వీళ్లిద్దరు పెళ్లి మ్యాటర్ లో ఎందుకు ఓపెన్ గా అభిమానులకు ప్రకటించడం లేదు అనే దానిపై సోషల్ మీడియా లో ఒక వాదన వినిపిస్తోంది. రష్మిక కన్నడ లో సినిమాలు చేస్తున్నప్పుడు, రక్షిత్ శెట్టి అనే స్టార్ హీరో ని ప్రేమించింది. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ గీత గోవిందం మూవీ షూటింగ్ సమయం లో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. కారణం విజయ్ దేవరకొండ నే అని అప్పట్లో కన్నడ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం చేసింది. అప్పటి నుండి రష్మిక కి కర్ణాటక ఆడియన్స్ నుండి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది.
ఆమె ఏ పోస్టు పెట్టినా ఇప్పటికే కన్నడ ఆడియన్స్ ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేరుగా విజయ్ దేవరకొండ తో పెళ్ళికి సంబంధించిన ఏ ఫోటో, లేదా వీడియో పెట్టినా, కన్నడ ఆడియన్స్ ఆమె పై తీవ్రంగా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నెగిటివిటీ ని తట్టుకోవడం కష్టం కాబట్టి, వీళ్లిద్దరు తమ పెళ్లి విషయాన్నీ గోప్యంగా ఉంచారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న విషయం కూడా గోప్యంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతోంది అనేది.