Vijay Deverakonda Rashmika Mandanna reception: ఎట్టకేలకు నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) జంట పెళ్లి ఉదయం 10:10 గంటలకు ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సమక్ష్యం లో జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన విశేషాలే ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి . ఈ పెళ్లి కి టాలీవుడ్ నుండి చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అలా హాజరైన వారిలో విజయ్ దేవరకొండ తో ‘అర్జున్ రెడ్డి ‘ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు. అదే విధంగా విజయ్ దేవరకొండ ఎంతో ప్రేమతో అన్నా అని పిలుచుకునే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వీళ్ళు తప్ప సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ పెళ్ళికి రాలేదు .
కానీ హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ కి మాత్రం టాలీవుడ్ మొత్తం హాజరు కాబోతుందని అంటున్నారు . వాళ్ళతో పాటు రాజకీయ నాయకులూ, పారిశ్రామిక వేత్తలు తదితరులు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి శుభలేఖలు ఇచ్చి వచ్చాడట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కూడా ఆయన శుభలేఖ ఇవ్వడం , అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి కూడా మనం చూసాము. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ , వీళ్ళ వెడ్డింగ్ రిసెప్షన్ కి ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకులకు ఎలాంటి ఆహ్వానం అందించలేదట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ , ఇలా ఎవ్వరికీ కూడా శుభలేఖలు ఇవ్వలేదట. ఒక్క బాలయ్య బాబు కి మాత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: ‘వారణాసి’ ని అవలీలగా దాటేసిన నాని ‘ది ప్యారడైజ్’..ఇది మామూలు మాస్ కాదు!
దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, విజయ్ దేవరకొండ కేవలం తనకు పరిచయం ఉన్న వాళ్ళను మాత్రమే పిలిచాడు అనే విషయం. బాలకృష్ణ తో ఆయనకు మొదటి నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి కూడా ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ విచ్చేశాడు. అలా వాళ్ళ మధ్య పరిచయం ఉన్నందున పిలిచాడు. కానీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం , డిప్యూటీ సీఎం విజయ్ దేవరకొండ కి అంతగా పరిచయం లేదు అందుకే ఆహ్వానించలేదేమో అని అంటున్నారు విశ్లేషకులు.