https://oktelugu.com/

Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ – రష్మిక నిశ్చితార్థం తేదీ ఫిక్స్..త్వరలోనే అధికారిక ప్రకటన!

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మండన ప్రేమ వ్యవహారం కూడా ఇదే ట్రాక్ లోకి వెళ్తుంది. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరి ఇంట్లో పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకున్నారు అట. నిశ్చితార్థం తేదీ కూడా ఖరారు అయ్యినట్టు సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2023 / 03:38 PM IST
    Follow us on

    Vijay Deverakonda – Rashmika engagement : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో విజయ దేవకొండ ప్రముఖ హీరోయిన్ రష్మిక మండన తో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు ప్రచారం అవుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు కెమెరాలకు వీళ్ళిద్దరూ దొరికిపోయినా కూడా మా మధ్య ఏమి లేదంటూ కవరింగ్ చేస్తూ వచ్చారు. కానీ రష్మిక ప్రస్తుతం ఉంటున్నది విజయ్ దేవరకొండ ఇంట్లోనే, ఈమధ్య కాలం లో ఇలా మా మధ్య ఏమి లేదంటూ చెప్పుకొస్తూ చాలా పెళ్లిళ్లు జరిగాయి.

    కొద్ది నెలల క్రితమే కియారా అద్వానీ మరియు సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి కూడా ఇలాగే జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కూడా అలాగే జరిగింది. గతం లో లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో మేము కేవలం స్నేహితులం మాత్రమే, మా మధ్య వేరేది ఏమి లేదు అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

    ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మండన ప్రేమ వ్యవహారం కూడా ఇదే ట్రాక్ లోకి వెళ్తుంది. అయితే రీసెంట్ గా వీళ్లిద్దరి ఇంట్లో పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకున్నారు అట. నిశ్చితార్థం తేదీ కూడా ఖరారు అయ్యినట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లిద్దరి నిశ్చితార్థం రాబొయ్యే రెండు మూడు నెలల్లోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది. గతం లో రష్మిక కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని ప్రేమించిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది.

    కానీ ఎందుకో వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. ‘గీత గోవిందం’ సినిమా సమయం లోనే ఈ సంఘటన జరిగింది. అప్పటి నుండి విజయ్ దేవరకొండ రష్మిక తో బాగా క్లోజ్ గా ఉండడం, ఆమె కష్టసుఖాలు పంచుకోవడం వంటివి చేసేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది, ఇప్పుడు పెళ్లి దాకా వచ్చేసింది.