Vijay Deverakonda : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆశ మార్చి వ్యవహారం కాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఫుల్ గా ముందుకు దూసుకెళ్లినప్పుడు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా రాణించే అవకాశాలు అయితే ఉంటాయి…అందుకే కొందరు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా వెలుగుందుతుంటే మిగిలిన వారు మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు… కారణం ఏదైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వాళ్ల కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని… వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి యంగ్ హీరోలు మాత్రం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పాన్ ఇండియాలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక అందులో భాగంగా విజయ్ దేవరకొండ లాంటి నటుడు ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి,గీత గోవిందం లాంటి వరుస బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు దక్కిన తర్వాత ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి ఆయన టైర్ వన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరూ అనుకున్నప్పటికి ఆ తర్వాత వచ్చిన వరుస ప్లాపులతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. ఇక ఇప్పుడు కనక ఆయనకు సక్సెస్ లు దక్కకపోతే మాత్రం విజయ్ దేవరకొండ మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఆయన మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఇక గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో కింగ్ డమ్ (Kingdom) అనే సినిమా చేశాడు. ఈ సినిమా జులై మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని చేస్తున్నాడు.
Also Read : హే ఏంటి ఇంత ఛేంజ్.. మెడలో రుద్రాక్ష, కాషాయ వస్త్రాలు.. మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ
అయితే ఇందులో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విజయ్ దేవరకొండ ధ్యానంలో ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేశారు. అయితే విజయ్ బ్యాక్ సైడ్ నుంచి ఆ ఫోటో ఉండడం గమనార్హం… మరి ఏది ఏమైనా కూడా ఇందులో తను చాలా సెటిల్డ్ గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ఆయన సినిమా కెరియర్ ఓకే అయితే ఇక మీదట చేయబోయే సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చే విధంగా ఉండాలి కానీ, డౌన్ చేసే విధంగా ఉండకూడదు అందుకే ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు…