https://oktelugu.com/

ముంబైలో గ‌ర్జిస్తున్న లైగ‌ర్‌.. ఎన్ని సెట్లు వేశారో తెలుసా?

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, డాషింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో వ‌స్తున్న క్రేజీ మూవీ ‘లైగర్’. పాన్ ఇండియన్ మూవీ రాబోతున్న ఈ సినిమాను చార్మి-క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. Also Read: సూప‌ర్ స్టార్‌కు ప‌వ‌ర్ స్టార్ గ్రీటింగ్స్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్‌! ‘సాలా క్రాస్ బ్రీడ్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ను ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది. దీంతో.. […]

Written By:
  • Rocky
  • , Updated On : March 23, 2021 / 12:38 PM IST
    Follow us on


    సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, డాషింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో వ‌స్తున్న క్రేజీ మూవీ ‘లైగర్’. పాన్ ఇండియన్ మూవీ రాబోతున్న ఈ సినిమాను చార్మి-క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది.

    Also Read: సూప‌ర్ స్టార్‌కు ప‌వ‌ర్ స్టార్ గ్రీటింగ్స్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్‌!

    ‘సాలా క్రాస్ బ్రీడ్’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ను ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది. దీంతో.. హైరేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ముంబై బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. లాక్ డౌన్ త‌ర్వాత కూడా ఆల‌స్యంగా మొద‌లైన ఈ సినిమా షూటింగ్.. ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రేప‌టి నుంచి ముంబైలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది.

    Also Read: సెకండ్ వేవ్ టెన్షన్ లేదు.. టాలీవుడ్ ధీమా..

    వాస్త‌వానికి ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఇప్ప‌టికే ఫినిష్ కావాల్సింది. కానీ.. ముంబైలో మొద‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంది. అందుకే.. లాక్ డౌన్ త‌ర్వాత అన్నిసినిమాలు వేగంగా షూటింగ్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టికీ.. ఈ సినిమా మొద‌లు కావ‌డానికే చాలా స‌మ‌యం ప‌ట్టింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కే సినిమా కాబ‌ట్టి.. ఇక్క‌డే తీయాల్సి వ‌స్తోంది. ఓ ద‌శ‌లో హైద‌రాబాద్ లో ముంబై సెట్ వేద్దామ‌ని కూడా ఆలోచించారు. కానీ.. మ‌ళ్లీ ఆ ఆలోచ‌న విర‌మించుకుని ముంబై ఫ్లైట్ ఎక్కేసింది యూనిట్‌.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మొత్తానికి.. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూనే సినిమా షూటింగ్ కొన‌సాగిస్తున్నారు. తాజా షెడ్యూల్ కోసం మొత్తం నాలుగు సెట్లు వేశారు. ముంబైలోని స‌న్నివేశాల‌న్నీ ఈ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడ‌ట పూరీ. ఈ షెడ్యూల్ త‌ర్వాత ముంబై నుంచి సెల‌వు తీసుకుంటార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత మిగిలిన లొకేష‌న్ల‌లో ప్ర‌శాంతంగా సినిమా తీసుకోవాల‌ని చూస్తున్నాడ‌ట‌. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.