Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఆయన అర్జున్ రెడ్డి మూవీతో ప్రతి ఒక్కరి చూపును ఆకర్షించాడు. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మధ్యలో కొంతవరకు తరబడినప్పటికి ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇప్పుడు రౌడీ జనార్ధన్, రణబాలి అనే సినిమాలు చేస్తున్నాడు… వాటితో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయన క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోతుంది. లేకపోతే మాత్రం మరోసారి కెరియర్ ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట విజయ్ దేవరకొండ నుంచి వచ్చే సినిమాలు భారీ విజయాన్ని సాధించాలని ఆయన తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడు.
తను తీసుకునే రెమ్యూనరేషన్ లో సగభాగం వాళ్ళ అమ్మానాన్నలకే ఇస్తున్నాడట. ఎందుకంటే వాళ్లు కొన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. కాబట్టి తన రెమ్యూనరేషన్ లో సగభాగాన్ని పేరెంట్ కి ఇవ్వాలని తను డిసైడ్ అయి అదే చేస్తున్నాడట. మిగతా సగం మాత్రమే తను తన సొంతానికి వాడుకుంటున్నాడట. నిజానికి విజయ్ దేవరకొండ సేవ దృక్పథం ఉన్న వ్యక్తి అందువల్లే ఆయన చాలా రకాల సేవలను చేస్తూనే వాళ్ళ పేరెంట్స్ ద్వారా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఫ్యూచర్ లో ఆయన నుంచి ఎక్కువ సంఖ్యలో సేవ కార్యక్రమాలు చూడబోతున్నామంటూ గతంలో పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పాడు. దానికి అనుగుణంగానే ఆయన పెద్ద మొత్తంలో పేదలకు సేవ చేయడానికి డబ్బులను పోగేస్తున్నాడు.
ఇక ఫ్యూచర్ లో ఇంకాస్త ఎక్కువ మందికి తను చేసే సేవ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు… రాబోయే రోజుల్లో ఆయన భారీ విజయాన్ని సాధించి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మారితే చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
