Rashmi Gautam- Sudigali Sudheer: బుల్లితెర వ్యాఖ్యత, సినీ నటి రష్మీ గురించి అందరికి తెలిసిందే. సుడిగాలి సుధీర్ కు రష్మీకి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చినా వారు ఎప్పుడు కూడా ఆ విషయంలో హద్దులు దాటలేదు. మేమిద్దరి మంచి మిత్రులం అనే విషయాన్ని చెబుతుంటారు. ఇద్దరు ప్రేమికులుగా నటించారే కానీ ఎప్పుడు వారిలోని నైజాన్ని బయట పెట్టుకోలేదు. రష్మీ గతంలో గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. తాజాగా నందు హీరోగా రష్మీ హీరోయిన్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా నిర్మించారు. అది నవంబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో సుడిగాలి సుధీర్ పాల్గొని మాట్లాడటంతో రష్మీ కంట నీరు పెట్టుకుంది. ఎమోషనల్ అయింది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మీ, నందు పోటీపడి నటించారు. పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లవుతున్నా కొత్త వాళ్లతోనే సినిమా తీశాం. కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్మీ మనసు మంచిదని సుడిగాలి సుధీర్ చెప్పడంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. జంతువులను సైతం ప్రేమించే గుణం ఆమెకు ఉండటంతో అందరు ఫిదా అవుతుంటారు. అందుకే ఆమె అంటే నాకు ఇష్టం కలుగుతుందని చెప్పడంతో ఆమె కాస్త ఉద్వేగానికి లోనయింది. తమ మధ్య స్నేహం మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకోసం నందు ఎంతో కష్టపడ్డాడు. కొత్తగా తయారు చేసుకున్న కథతో ఎవరిని కలిసినా వారు కథ మాకు ఇచ్చేయండి అని అడిగారే కానీ సినిమా తీసేందుకు ముందుకు రాలేదు. దీంతో తామే సినిమా తీయాలని భావించాం.
సినిమా హిట్ అయినా కాకపోయినా మాకు మంచి స్ఫూర్తిని ఇచ్చింది. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా వచ్చింది. ఈ నేపథ్యంలో నందుకు రష్మీకి మధ్యలో కూడా ఏదో ఉందనే అపవాదు సృష్టించినా లెక్క చేయకుండా సినిమా పూర్తి చేశాం. రేపు థియేటర్లలోకి రానుండటంతో సినిమాను హిట్ చేయాలని ఆకాంక్షించారు. ఇండస్ట్రీని వదిలేది లేదు. ఇక సీరియల్ గా సినిమాలు చేస్తాం. ఎవరైనా సపోర్టు చేస్తే సాయం తీసుకుంటాం. లేదంటే సొంతంగా నిర్మాణం చేస్తామని వారు పేర్కొన్నారు.

సినిమా ట్రైలర్ చూశాక మాకు విశ్వాసం పెరిగిందని నందు చెబుతున్నాడు. రష్మీ కూడా అద్భుతంగా నటించింది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ లో అన్ని అంశాలు ఉన్నాయి. వినోదం, ప్రేమ, కామెడీ మేళవింపుతో సినిమా నిర్మించాం. దీంతో ఇది ప్రేక్షకులను అలరిస్తుంది. కొత్త వారితో నిర్మించినా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దీంతో బొమ్మ బ్లాక్ బస్టర్ మరో హిట్ సాధిస్తుందని అందరు చెబుతుండటం విశేషం.