https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ తహతహతో ‘సమంత’ ఉక్కిరిబిక్కిరి !

Vijay Devarakonda: ‘విజయ్ దేవరకొండ’ సినిమాలో ముద్దు సీన్లు సర్వసాధారణం. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో.. ఆ తర్వాత బాలీవుడ్ లో.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ తరహా సీన్లు చాలా కామన్ అయిపోయాయి. అయితే, తెలుగులో లిప్ లాక్స్ కి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఎలాగూ యూత్.. ముద్దులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది కాబట్టి.. విజయ్ దేవరకొండ స్టార్ కూడా అయ్యాడు. కేవలం మోటు డైలాగ్ లు, ఘాటు సన్నివేశాలతో పాపులర్ అయిన విజయ్, […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 01:29 PM IST
    Follow us on

    Vijay Devarakonda: ‘విజయ్ దేవరకొండ’ సినిమాలో ముద్దు సీన్లు సర్వసాధారణం. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో.. ఆ తర్వాత బాలీవుడ్ లో.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ తరహా సీన్లు చాలా కామన్ అయిపోయాయి. అయితే, తెలుగులో లిప్ లాక్స్ కి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఎలాగూ యూత్.. ముద్దులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది కాబట్టి.. విజయ్ దేవరకొండ స్టార్ కూడా అయ్యాడు.

    Vijay Devarakonda, samantha

    కేవలం మోటు డైలాగ్ లు, ఘాటు సన్నివేశాలతో పాపులర్ అయిన విజయ్, తన ప్రతి సినిమాలో తన శైలి సీన్ల ముద్ర ఉండాలని తహతహలాడుతున్నాడు. ఇప్పుడు ఈ ‘తహతహ’నే సమంతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజానికి సమంతకి ఘాటు దృశ్యాలు ఏమి కొత్త ఏమి కాదు.

    Also Read: Heroine Gazala: ఆ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డ హీరోయిన్ గ‌జాలా.. చివ‌ర‌కు దారుణ‌మైన మోసం..!

    కాకపోతే, ఇక్కడ హీరో విజయ్ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌ గా ‘సమంత’ నటిస్తుంది. కాశ్మీర్‌ నేపథ్యంలో రానున్న ఈ ప్రేమ కథలో చాలా ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి. ఆ సీన్స్ ఎలివేషన్స్ లో కొన్ని లిప్ లాక్ లు ఉన్నాయి.

    అన్నిటికీ మించి ఇంటర్వెల్ సీన్ లో వచ్చే ఓ లాంగ్ లిప్ లాక్ సన్నివేశం చాలా బోల్డ్ గా ఉంటుందట. సినిమా మొత్తానికే ఈ హాట్ సీన్ ఫేవరేట్. అందుకే.. ఈ సీన్ చాలా సహజంగా ఉండాలని శివ నిర్వాణ కోరుకుంటున్నాడు. సమంతకి కథ చెప్పినప్పుడే ఆమెకు ఈ విషయం చెప్పాడు. అప్పుడు ఓకే చెప్పిన సామ్.. ఇప్పుడు ఆలోచనలో పడింది.

    కాకపోతే, తాను ఆ లిప్ లాక్ లో నటించను అని తేల్చి చెప్పలేకపోతుంది. కారణం.. సినిమాకి ఆ సీన్స్ చాలా కీలకం. పైగా విజయ్ తో తన కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకు మెయిన్ హైలైట్. అందుకే.. ఆ ముద్దు సీన్లలో నటించాలా ? లేదా ? అని సమంత ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉంది. మరి సమంత ఈ సీన్స్ లో నటిస్తే.. ఈ సినిమాకే ఆ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఫైనల్ గా సామ్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తోందో చూడాలి.

    Vijay Devarakonda, samantha

    ఇక ఈ సినిమా లాంచింగ్ గురించి ఓ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ మీ కోసం. ఈ నెల 21న హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానుంది. అలాగే, 23 నుంచి కాశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సినిమాలో విజయ్ ఆర్మీ వ్యక్తిగా.. సమంత కశ్మీరీ బ్యూటీగా కనిపించనుంది.

    Also Read:Bigg Boss Telugu OTT: స్ర‌వంతిని వాడుకున్నావ్.. శివ‌పై బింధుమాధ‌వి ఫైర్‌.. అత‌ని వెన‌కాల ప‌డలేద‌న్న అషురెడ్డి..

    Recommended Videos:

    Tags